Nalgonda : ఫ్లోరైడ్ పీడిత, కరువు కాటకాలతో ఉన్న నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలి..!
Nalgonda : ఫ్లోరైడ్ పీడిత, కరువు కాటకాలతో ఉన్న నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలి..!
దేవరకొండ, మనసాక్షి :
ఫ్లోరైడ్ పీడిత కరువు ప్రాంతమైన నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించే ఎస్ఎల్బీసీ మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు అందించే డిండి ఎత్తిపోతల పథకాన్ని పర్యావరణ అనుమతులు తీసుకొని పూర్తి చేయాలని సిపిఐ నల్గొండ జిల్లా సమితి పక్షాన వినతి పత్రాన్ని అందజేశారు.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ సందర్శన, సమీక్షా సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకి, నీటి పారుదల పౌర సరఫరాల శాఖమంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి , రోడ్లు భవనాలు, సిని ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్ ఎల్ బి సి టన్నెల్ వద్ద వినతి పత్రాన్ని సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు సిపిఐ బృందం అందజేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్‌ను ఆమోదించి పూర్తి చేయాలి,ఎస్ఎల్బిసి సొరంగం పూర్తికి తగిన నిధులు కేటాయించి నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని గత పది సంవత్సరాలుగా నల్గొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టలను గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించింది. అధికారంలోనికి వచ్చిన వెంటనే మళ్ళీ ఈ ప్రాజెక్టులకు సమీక్ష చేసి ఎస్ ఎల్ బి సి ని పునః ప్రారంభించినందుకు సిపిఐ జిల్లా పక్షాన అభినందనలు తెలిపినారు.
ALSO READ : District collector : హడలెత్తించిన జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..!
నల్లగొండ జిల్లాలో మునుగోడు,దేవరకొండ నియోజకవర్గ కరువు,ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు,తాగునీరు అందించేందుకు చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన డిoడి ఎత్తిపోతల పథకం నిర్మాణం చేసి నల్లగొండ జిల్లాల పరిధిలోని సుమారు 3.61 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు జి.వో. 107 (జూన్ 11) 2015న విడుదల చేశారు.
నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడ్ నియోజకవర్గాల పరిధిలోని సుమారు 3.41 వేల ఎకరాల ఆయకట్టును స్థిరికరించారని, దాని కింద కొన్ని నిధులు మంజూరు చేసి సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టిరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతున్నాయని, కానీ గత ప్రభుత్వం డిపిఆర్‌ను ఆమోదించలేదని తెలిపారు.
దీంతో ఈప్రాజెక్టు విషయమై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉన్నది.తమ ప్రభుత్వమైనా వెంటనే పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎదుళ్లా రిజర్వాయర్ నుండి రోజుకు 0.5 టిఎంసి చొప్పున 60 రోజుల పాటు 30 టిఎంసిలు నీటిని తీసుకునే విధంగా డిపిఆర్‌ను అమోదించాలని, పర్యావరణం అనుమతులు పొంది పనులు ప్రారంభించి పూర్తి చేయుటకు నిధులు కేటాయించాలని కోరారు.
నల్లగొండ జిల్లాలో సుమారు 3.20 వేల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు సాగునీరు ఇచ్చే శ్రీశైలం సొరంగం పనులు 19 సం॥రాల క్రితం 1925 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు.. నేటికి ప్రాజెక్టు వ్యయయం 4658 కోట్ల పెరిగింది. ఇంకా 9.5 కి.మీ. సొరంగం తవ్వాల్సి ఉన్నద. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన రూ. 800 కోట్లు సరిపోవని,పూర్తి నిధులు కేటాయించి పూర్తిచేయించాలి అన్నారు.
ALSO READ : Malkajgiri : అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు.. కూల్చివేసిన అధికారులు..!
గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేయడం మూలాన నల్లగొండ జిల్లాకు తీవ్ర నష్టం జరిగింది అన్నారు… ఈ ప్రభుత్వ హయాంలోనైనా ఫ్లోరైడ్ పీడిత, కరువు కాటకాలతో ఉన్న నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి డిండి ఎత్తిపోతల పథకం,శ్రీశైలం సొరంగ మార్గాన్ని తక్షణమే పూర్తి చేయాలని కోరుతున్నాం అని వినతిపత్రంలో పొందుపరిచారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు బి వెంకటరమణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎండి మైనుద్దీన్, టీ బుచ్చిరెడ్డి, ఎస్ కనకాచారి, డి సుదర్శన్ రెడ్డి, యు వెంకటయ్య,ఎన్ రామస్వామి, వి ఆంజనేయులు,టి విజేందర్ రెడ్డి,నాయకులు పి రంగారెడ్డి, ఎన్ నవీన్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
-
Batti Vikramarka : రూ.1000 కోట్ల బడ్జెట్ తో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బీసీ సొరంగం, 4 వేల కోట్లకు పెరిగింది.. డిప్యూటీ సీఎం బట్టి..!
-
మహిళలకు శుభవార్త.. ఇందిరా మహిళా శక్తి యూనిట్ల గ్రౌండింగ్ కు పకడ్బందీ చర్యలు..!
-
Rythu Bharosa : రైతులకు అదిరే శుభవార్త.. ఎకరానికి 15000, రైతు భరోసా డేట్ ఫిక్స్..!
-
TG News : తెలంగాణ పేదలకు గుడ్ న్యూస్.. వారికి అక్టోబర్ లో ఇందిరమ్మ గృహాలు.. మంత్రి కోమటిరెడ్డి వెల్లడి..!
-
దసరా సెలవుల డేట్స్ ఇవే.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!
-
Ganesh Laddu : రికార్డ్ బ్రేక్.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డు..!









