Breaking Newsక్రైంజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్య..!

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్య..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా కొనసాగుతున్నారు.

ఆయన ఉదయం గ్రామంలో బైక్ పై వెళుతున్న క్రమంలో గుర్తు తెలియని దుండగులు గంగారెడ్డిని కార్ తో వెనుక నుంచి ఢీకొట్టారు. దాంతో అతని బైక్ కింద పడింది వెంటనే విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి అతనిని హత్య చేశారు. కుటుంబ సభ్యులు గంగారెడ్డిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. జీవన్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులు భారీగా రోడ్డుపై నిరసన చేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే ఈ హత్యకు రాజకీయ కక్ష..? లేక భూవివాదం వల్ల జరిగిందా..? అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు.

LATEST UPDATE :

Miryalaguda : అర్ధరాత్రి వెళితే తిరస్కరించిన వేళ.. కట్ చేస్తే సన్మానం..!

Aadhar Card : ఆధార్ కార్డు ట్యాంపరింగ్.. కొత్త తరహాలో సైబర్ మోసం..!

Komatireddy Venkatreddy : పది రోజులలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులోకి నీళ్లు.. మంత్రి కోమటిరెడ్డి..!

Nalgonda : అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై పోలీస్ కుటుంబ సభ్యుల రాస్తారోకో..!

District collector : సంక్షేమ పథకాల అధ్యయనంకు సివిల్ సర్వీస్ ప్రొబెషనరీ అధికారుల బృందం..!

మరిన్ని వార్తలు