Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేటలో ఆ.. వార్డుకు కీడొచ్చిందట..!

Suryapet : సూర్యాపేటలో ఆ.. వార్డుకు కీడొచ్చిందట..!

సూర్యాపేట, మన సాక్షి :

వార్డులో వరుస మరణాలు సంభవిస్తుండడంతో ఆ వార్డు ప్రజలంతా కలసి వార్డుకు కీడొచ్చిందని వార్డును విడిచి వనవాసాలకు వెళ్ళారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 20వ వార్డు జమ్మిగడ్డ ప్రజలు ఆదివారం వార్డు మొత్తాన్ని ఖాళీ చేసి వనవాసాలకు తరలివెళ్ళడంతో వార్డు మొత్తం ఖాళీ అయ్యి నిర్మాణుష్యంగా మారింది.

20వ వార్డు జమ్మిగడ్డలో ఓ మంగళవారం ఓ వ్యక్తి అనారోగ్య కారణంతో మృతి చెందాడు. నాటి నుంచి ప్రతి మంగళవారం ఒకరు చనిపోతుండగా ఇలా నెల రోజుల వ్యవధిలో వార్డుకు చెందిన ఆరుగురు వివిధ కారణాలతో మృతి చెందారు. పదేళ్ళ క్రితం ఇదే వార్డులో సుమారు 23మంది చనిపోగా అప్పుడు వేద పండితులను సంప్రదిస్తే వారు వార్డు విడిచి వనవాసాలకు వెళ్ళాలని సూచించడంతో వారు చెప్పినట్లుగా చెట్ల క్రిందికి వెళ్లారు.

దీంతో నాడు మరణాలు ఆగిపోయాయనీ వారి నమ్మకం.అదే తరహాగా ప్రస్తుతం కొనసాగుతున్న మరణాలను ఆపేందుకు నాడు చేసినట్లుగానే నేడు చేయాలని నిర్ణయించి వేద బ్రాహ్మణులను సంప్రదించగా వారు వార్డు విడిచి వనవాసాలకు వెళితే కొంత కీడు తొలగుతుందని చెప్పారనీ పేర్కొన్నారు. దీంతో వార్డు ప్రజలంతా సుమారు 1000 కుటుంబాలు ఉండగా 600ల కుటుంబాల వరకు దురాజ్పల్లి, ఉండ్రుగొండ, ఇతర ప్రాంతాలకు వనవాసాలకు వెళ్లారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు