Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండరంగారెడ్డిహైదరాబాద్

Lone App : లోన్ యాప్ ల పేరుతో సైబర్ మోసాలు..!

Lone App : లోన్ యాప్ ల పేరుతో సైబర్ మోసాలు..!

మేడ్చల్ మల్కాజిగిరి, మనసాక్షి

లోన్ యాప్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులకు మోసాల వల వేస్తున్నారు. తస్మా జాగ్రత్త భయం వద్దు, భరోసాగా మీకు మేమున్నాము అని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ నేరగాళ్లు అమాయకులకు మోసాల వల వేస్తున్నారు. బాధితులు ఈ యాప్‌ల ను ఇన్‌స్టాల్ చేసుకోవడంతో, వారి ఫోన్లపై నేరస్తులు నియంత్రణ పొందుతారు.

ఎలాంటి డాక్యుమెంట్‌లు లేకుండా చిన్న మొత్తంలో రుణాలు ఇస్తారు, కానీ తర్వాత బాధితుల ఫోటోలను నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. కేవలం రెండు వేల నుండి అయిదు వేల రూపాయల వరకు అప్పుగా ఇచ్చి, ఆ తర్వాత లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తారు.

డబ్బులు ఇవ్వకుంటే బాధితుల మార్పిడి ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తామని లేదా వాళ్ల పరిచయస్తులకి పంపుతామని బెదిరింపులకు పాల్పడుతారు. వారి బ్లాక్మెయిల్ కు లొంగిపోయి బాధితులు వేలు, లక్షల్లో డబ్బులు పోగొట్టుకోవడమో లేదా అవమానంగా భావించి ఆత్మహత్యలకు పాల్పడడమో చేస్తున్నారు.

లోన్ యాప్ నేరగాళ్ల బారిన పడకండి, ఒకవేళ మీరు బాధితులు అయితే వెంటనే డైల్ -100 లేదా 1930 కు కాల్ చేయండి. భయం వద్దు, భరోసాగా మీకు మేమున్నామని తెలియజేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు