Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking News

TGSRTC : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. గడువు లేదు, వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి..!

TGSRTC : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. గడువు లేదు, వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ ఈ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆర్టీసీలో 1201 డ్రైవర్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ వెలువడింది. కాగా దరఖాస్తుల గడువు నవంబర్ 30వ తేదీలోపు చేసుకోవలసి ఉంది. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ కోరింది.

ఎంపికైన వారికి నెలకు 26 వేల వేతనంతో పాటు రోజువారీగా 150 రూపాయల అలవెన్స్ వస్తుంది. అందుకు మాజీ సైనికులై ఖచ్చితంగా ఉండాలి. హెవీ డ్యూటీ లైసెన్స్ కలిగి ఉండాలి. 18 నెలల పాటు డ్రైవింగ్ అనుభవం ఉన్నవారై ఉండాలి. అదేవిధంగా 58 సంవత్సరాల లోపు ఉన్న వారే దరఖాస్తు చేసుకోవలసి ఉంది. అంతే కాకుండా 160 సెంటీమీటర్ల ఎందుకంటే తక్కువ ఉంటే అనర్హులుగా గుర్తించనున్నారు.

కేవలం ఆసక్తి ఉన్న మాజీ సైనికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంది. ఎంపికైన వారికి వారు కోరుకున్న డిపోలోనే ఉద్యోగం కేటాయిస్తారు. porsb-ts@rtc.in లేదా emprsb-ts@rtc.in మెయిల్ చేయాలని డైరెక్టర్ సైన్ కి వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు