Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking Newsవ్యవసాయం

AP News : ఫెంగల్ తుఫాన్ తో రైతుల్లో ఆందోళన..!

AP News : ఫెంగల్ తుఫాన్ తో రైతుల్లో ఆందోళన..!

రామసముద్రం, మనసాక్షి అన్నమయ్య జిల్లా :

బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం తో గత మూడు రోజులుగా మండలం లో కురుస్తున్న వర్షాల కు రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. వాయుగుండం ప్రభావం తో గత మూడురోజులు గా తుంపర వర్షం కురుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో వరి పంటలు నేల వాలాయి.

వాతావరణం మబ్బుగా ఉండటం తో ఈవర్షం వల్ల కొత్తిమీరి, కోసు, వరి, టమోటా పంటలు దెబ్బ తినే అవకాశం ఉందని రైతులు తెలిపారు. ఇలాగే వర్షం పడితే వరి పంట నేలవారి పోతుందన్నారు. వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ మాట్లాడుతూ రైతులు ప్రస్తుత పరిస్థితుల వల్ల జాగ్రత్తగా ఉండాలని వరి కోతలు 2,3రోజులు వాయిదా వేసుకోవాలని పొలాల్లో నీటి నిల్వ ఉండ కుండా చేసుకోవాలన్నారు.

ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు, సలహాలు అందజేస్తామని పేర్కొన్నారు. తుఫాన్ కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి మూగ జీవాలు అర్తనాదాలు కలిసివేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గొర్రెలు, మేకలు, పాడిఆవులు ఆకలితో అలమటిస్తున్నాయి. వర్షానికి పశువుల పోషణ కు రైతులకు భారంగా మారింది. పశువుల మేతల తెంచుకోవాలన్నా వర్షంపడుతూ ఉండడంతో రైతులు అవస్థలు పడుతున్నారు.

విద్యుత్ అధికారులు డి ఈ ఈ వై హరికుమార్, ఏ ఈ మస్తాన్ వల్లి మాట్లాడుతూ.. తుఫాన్ వల్ల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలం దగ్గర ఉన్న కరెంట్ స్థంబాలను, స్థాటర్ లను ముట్టుకోరాదని ముఖ్యం గా చిన్న పిల్లలు విద్యుత్ స్థంబాలు ముట్టుకోరాదన్నారు.

ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడిన స్థంబాలు నేల రాలిన మాకు వెంటనే తెలపాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.దూర ప్రాంతాలకు వెళ్లే వారు వాయిదా వేసుకోవాలని మండల అధికారులు తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు