Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Additional collector: ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి.. అదనపు జిల్లా కలెక్టర్..!

Additional collector: ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి.. అదనపు జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీ లోపు తెలియజేయాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ )బెన్ శాలం రాజకీయ పార్టీలను కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ పర్యవేక్షణలో ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ నెల 7 వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని వివరించారు.

జిల్లా పరిధిలో 280 జీ.పీలు, 2544 వార్డులకు, పోలింగ్ కేంద్రాలను ముసాయిదా జాబితాలో పొందుపర్చడం జరిగిందని వివరించారు.ఈ ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 12 వ తేదీలోపు తెలియజేయాలని, ఈనెల12న అన్ని మండలాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలు నిర్వహించే సమావేశంలోనూ అభ్యంతరాలు స్వీకరిస్తారని అదనపు కలెక్టర్ తెలిపారు.

వచ్చిన అభ్యంతరాలను 13వ తేదీన పరిష్కరించడం జరుగుతుందని, జిల్లా పాలనాధికారి ఆమోదం అనంతరం ఈ నెల 17న అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించబడుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,09,090 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. కొత్త ఓటర్లు ఒకే వార్డ్ లో ఉండాలి అని రాజకీయ ప్రతినిధులు సూచించారు.

ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో జడ్. పి. సి. ఈ. ఓ. భాగ్య లక్ష్మి,డిప్యూటీ సి. ఈ. ఓ. జ్యోతి, డి. పి. ఓ. కృష్ణ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కాంగ్రెస్, బి.ఆర్.ఎస్, బి. జె. పి, ఎం.ఐ.ఎం,టి.డి.పి, సి.పి.ఎం.ప్రతినిధులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు