Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : యువకులపై న్యూసెన్స్ కేసు.. కోర్టు ఆవరణ పరిశుభ్రం శిక్ష..!

Nalgonda : యువకులపై న్యూసెన్స్ కేసు.. కోర్టు ఆవరణ పరిశుభ్రం శిక్ష..!

దేవరకొండ, మనసాక్షి :

దేవరకొండ పట్టణంలో మంగళవారం రాత్రి చౌటుప్పల్ కు చెందిన కొంత మంది యువకులు న్యూసెన్స్ చేయడం జరిగింది. దేవరకొండ ఎస్ హెచ్ ఓ ఎం. నర్సింహులు తెలిపిన ప్రకారం…రాకేష్, నవీన్, శివా రెడ్డి, రాజేందర్, సందీప్ రెడ్డి, శివా రెడ్డి అనే యువకులు దేవరకొండ పట్టణంలో న్యూసెన్స్ కు పాల్పడినందుకు దేవరకొండ పోలీసు లు కేసు నమోదు చేశారు.

దేవరకొండ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ పొట్ట చెన్నయ్య ముందు వారిని హాజరు పరచగా ఆరు వేల రూపాయలు జరిమానా విధిస్తూ, కమ్యూనిటీ సోషల్ సర్వీస్ క్రింద ఒక రోజు దేవరకొండ కోర్టు ఆవరణలో పరిశుభ్రం చేయించడం జరిగినది అని దేవరకొండ స్టేషన్ ఎస్ హెచ్ ఓ ఎం. నర్సింహులు తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు