Wonder Girl : అతి చిన్న వయసులోనే ఇండియన్ గర్ల్ కార్తికేయన్ ప్రపంచ రికార్డ్.. 16ఏళ్ళ వయసులోనే 7 ఎత్తైన పర్వతాలు..!
Wonder Girl : అతి చిన్న వయసులోనే ఇండియన్ గర్ల్ కార్తికేయన్ ప్రపంచ రికార్డ్.. 16ఏళ్ళ వయసులోనే 7 ఎత్తైన పర్వతాలు..!
మన సాక్షి:
అవి ప్రపంచంలోనే అతి ఎత్తయిన పర్వతాలు.. ప్రమాదాకరమైన వాటిని ఎంచక్కా ఎక్కేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది మన భారత దేశానికి చెందిన ఓ అమ్మాయి. వరల్డ్‌లోనే ఏడు ఖండాల్లో ఉన్న చాలా ఎత్తైన పర్వతాలను ఎక్కిన చిన్న వయసున్న బాలికగా.. ప్రపంచ రికార్డు సాధించిన కామ్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కామ్యా కార్తికేయన్‌కు 16 ఏళ్ళ వయసు. ముంబైలోని నేవీ చిల్ర్డన్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి కమాండర్ కార్తికేయన్ ఇండియన్ నేవీలో పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో తన తండ్రిని ఆదర్శంగా తీసుకున్న కామ్య…ఈ వండర్‌ను కూడా తండ్రి కార్తికేయన్‌తో కలిసి పూర్తి చేసింది.
ప్రపంచంలో అత్యంత ఎత్తైన మౌంటైన్లను ఎక్కిన చిన్న వయసుగల అమ్మాయిగా రికార్డు సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించి… అతి చిన్న వయసులోనే ఎంతో సాహసోపేతమైన ఘనకార్యం సాధించి…ఉత్తర, దక్షిణ దృవాలను చేరడమే తన లక్ష్యంగా చెబుతున్న కామ్యా కార్తికేయన్‌కు అభినందనలు తెలుపుతూ… అల్ ది బెస్ట్ చెబుదాం.
ఇంతకీ కామ్యా కార్తికేయన్ చకచకా ఎక్కేసిన ఆ 7 పర్వతాలు ఏంటో…తెలుసా..? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆ ఏడు పర్వతాల గురించి తెలుసుకుందాం.
మౌంట్ ఎవరెస్ట్(ఆసియా)
ఆసియా ఖండంలో ఉన్న ఎవరెస్ట్ శిఖరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్వతాలలో ప్రసిద్ధిగాంచింది. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతంగా గుర్తింపు ఉండటంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి చాలా మంది పర్వతారోహకులు ఉత్సాహం చూపుతారు. దీని ఎత్తు 8,848 మీటర్లు(29,028 అడుగులు). ఎంతో అందంగా…ఆకర్షనీయంగా ఉండే…ఈ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎవరెస్ట్ శిఖరం…చాలా మంది పర్వతారోహకులకు సవాల్ విసురుతుంది.
మౌంట్ అకాన్కాగువా(దక్షిణ అమెరికా):
మౌంట్ అఆన్కాగువా ఎత్తు దాదాపు 6,961 మీటర్లు(22,837 అడుగులు). ఇది కూడా ఒక రకమైన అగ్నిపర్వతమైనప్పటికీ…వెయ్యేళ్ళ నుంచి ఇప్పటి వరకు విస్పోటనం చెందలేదని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. అయితే దీని ఎత్తుపై వివాదాలు కూడా ఉన్నాయి.
ఇది దక్షిణ అమెరికాలో ఎవరెస్ట్ పర్వతం 8,848 మీటర్లు(29,029 అడుగులు) తర్వాత అత్యంత ఎత్తైన పర్వతంగా గుర్తింపు పొందింది. దీని ఎత్తును 6,959 మీటర్లు(22830 అడుగులు) అని కూడా కొందరు పరిశోధకులు చెబుతారు.
మౌంట్ డెనలి(ఉత్తర అమెరికా)
మౌంట్ డెనలిని మెకిన్టీ అని కూడా పిలుస్తారు కొందరు పర్వతారోహకులు. ఇది ఉత్తర అమెరికాలో ఉన్న అత్యం ఎత్తైన పర్వతం. దీని ఎత్తు 6,190 మీటర్లు(20,310 అడుగులు). మౌంట్ డెనలి చాలా అంతమైన పర్వతంగా ప్రసిద్ధిగాంచింది.
కిలిమంజారో(ఆఫ్రికా)
ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతంగా కిలమంజారోకు పేరుంది. ఈ పర్వతం ఎత్తు 5,895 మీటర్లు
(19,340 అడుగులు). ఇది మూడు అగ్ని పర్వత శంకువులతో ఉంటుందట. ఇప్పుడు నిద్రాణంగా ఉన్నా… మళ్ళీ విస్ఫోటనం చెందే అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు. ఇది ఎవరెస్ట్ శిఖరంకంటే 2,950 మీటర్లు మాత్రమే తక్కువ. ఆఫ్రికాలో ఎత్తైన ఈ పర్వతం…మౌంటేనియర్లకు సవాల్ విసురుతుంది. మంచుతో కప్పి ఉండే ఈ శిఖరం…తన అందంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే…పర్వతారోహకులను రా…రమ్మని పిలుస్తోంది.
మౌంట్ విన్సన్(అంటార్కటికా)
మౌంట్ విన్సన్ అంటార్కిటికాలోని అత్యంత ఎత్తైన పర్వతంగా గుర్తింపు పొందింది. దీని ఎత్తు 4,892 మీటర్లు(16,050 అడుగులు). మౌంట్ విన్సన్ పర్వతం కూడా ఎంతో ప్రకృతి రమణీయతను కలిగి ఉండి…పర్వతారోహకులకు సవాల్ విసురుతుంది.
మౌంట్ ఎల్బ్రస్(యూరప్)
మౌంట్ ఎల్బ్రస్ ఐరోపా ఖండంలోనే అత్యంత ఎత్తైన పర్వతం. రష్యాలో ఉంది.
మౌంట్ ఎల్బ్రస్ పర్వతం కూడా అగ్రిపర్వతాలతో కూడుకుని ఉంటుంది. ఇది చివరిసారి సుమారు 50ACలో విస్పోటనం చెందినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది చాలా మంది పర్వతారోహకులను ఆకర్షిస్తుంది. ఈ మౌంట్ ఎల్బ్రస్ పర్వతం ఎత్తు 5,642 మీటర్లు(18510 అడుగులు).
మౌంట్ కాజీయాస్కో(ఆస్ట్రేలియా)
ఈ పర్వతం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఉండే… ఆస్ట్రేలియన్ ఆల్ఫ్స్ నేషనల్ పార్క్స్ రిజర్వ్‌లో ఉన్న కోస్కియుస్కో నేషనల్ పార్క్‌లో ఉంటుంది. మౌంట్ కాజీయాస్కో ఆస్ట్రేలియాలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా గుర్తింపు పొందింది. దీని ఎత్తు 2,228 మీటర్లు(7310 అడుగులు). ఈ పర్వతం కూడా పర్వతారోహకులకు సవాల్ విసురుతుంది.
కామ్యా కార్తికేయన్ తన తండ్రితో కలిసి 2024 డిసెంబర్ 24 రోజు ఈ ఎత్తైన 7 శిఖరాల పర్వాతారోహణ రికార్డును పూర్తి చేసింది. ప్రపంచంలోని ఎత్తైన పర్వాతల విశేషాలతో పాటు. కామ్యా కార్తికేయన్ సాధించిన రికార్డ్ స్థాయి విజయం తెలుసుకున్నారు కదా. కామ్యా కార్తికేయన్ కోరుకుంటున్నట్టు ఉత్తర-దక్షిణ ధృవాల అంచులను కూడా ఆమె చేరుకుని. మరో రికార్డును కూడా సాధించాలని కోరుకుందాం. ఆమె జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని మన సాక్షి ఆల్ ది బెస్ట్ చెబుతోంది. మీరు కూడా కామ్యా కార్తికేయన్‌కు విషేస్ చెప్పండి మరి.
Reporting :
Mahipal Reddy, Hyderabad
MOST READ :
-
Cell Phones : కాలేజీల్లో సెల్ ఫోన్ ఎంట్రీపై ఉన్నత విద్యామండలి కొత్త రూల్..!
-
2024 Google Top Search in World : 2024 గూగుల్ సెర్చ్ ట్రెండ్‌లో మొదటి స్థానం ఎవరిది.. ఏది ఎక్కువగా సెర్చ్ చేశారు..!
-
Social Media : సోషల్ మీడియా మాయలో మీ మెదడు పుచ్చిపోయిందా.. బ్రెయిన్ రాట్‌తో జాగ్రత్త..!
-
THIRUMALA : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. గోవిందుడు దర్శనానికి 22 గంటలపైనే..!
-
Beer : బీర్ ఆల్కహాల్ కాదా.. అక్కడ విచ్చల విడిగా బీర్ తాగుతారా..!











