Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో ఆపరేషన్ చెబుత్ర.. భారీగా వాహనాల పట్టివేత..!

Miryalaguda : మిర్యాలగూడలో ఆపరేషన్ చెబుత్ర.. భారీగా వాహనాల పట్టివేత..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డి.ఎస్.పి కె. రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ఆపరేషన్ చెబుత్ర లో భాగంగా డిసెంబర్ 29, 30 తేదీలలో రాత్రి మిర్యాలగూడ పట్టణంలో పోలీసులు నాలుగు ప్రదేశాలలో అకస్మైక తనిఖీలు చేశారు.

కారణం లేకుండా ఆకారణంగా రోడ్ పై తిరుగుతున్న (25) మోటార్ సైకిలళ్లు, (3) కార్లు, (2) ఆటొ లను, 40 మంది వ్యక్తులను పట్టుబడి చేసి (18) డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. అట్టి వాహనాల యొక్క డాక్యుమెంట్స్ పరిశీలించి సరేనా పత్రాలు లేని వాహనాలపై చట్టపరమైన చర్య తీసుకోవడమైనది.

వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మరొకసారి అర్ధరాత్రిలు రోడ్డుపై కనిపిస్తే కేసులు తప్పవని బైండోవర్లు కూడా చేస్తామని గట్టిగా హెచ్చరించి పంపించడం అయినది. ఈ ఆపరేషన్ లో మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ పి. నాగార్జున, మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ బి. రాంబాబు, మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లోకేష్, వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు