నిజాయితీతో వార్తలందిస్తున్న పత్రిక మన సాక్షి.. మున్సిపల్ చైర్ పర్సన్..!
నిజాయితీతో వార్తలందిస్తున్న పత్రిక మన సాక్షి.. మున్సిపల్ చైర్ పర్సన్..!
శంకర్‌పల్లి (మన సాక్షి) :
నిజాయితీతో కూడిన వార్తలందించాలని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం శంకర్‌పల్లి పురపాలక సంఘం కార్యాలయంలో మన సాక్షి తెలుగు దిన పత్రిక 2025 క్యాలెండర్ ను వైస్ చైర్మన్ వెంకట్రాం రెడ్డి, కమిషనర్ శ్రీనివాస్ తో కలిసి చైర్ పర్సన్ విజయలక్ష్మి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక అంశాలను, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా ప్రజల న్యాయపరమైన హక్కులకు మద్దతు ఇస్తుందని, నిజాయితీతో కూడిన వార్తలను అందించాలని తెలియజేశారు.
ఈ పత్రిక ద్వారా పట్టణ ప్రాంతానికి మరింత గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. స్థానిక జర్నలిస్టు గండేటి రాజేష్ గౌడ్ ను వారు అభినందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ చంద్రమౌళి, ముకుందం గౌడ్, వివిధ పత్రికల జర్నలిస్టులు పాల్గొన్నారు.
MOST READ :
-
Bank Transaction : ఫోన్ పే, గూగుల్ పే ఉందని ఎక్కువ లావాదేవీలు చేస్తున్నారా.. లిమిట్ ఎంతో తెలుసుకోకుంటే కష్టమే..!
-
SBI : డిగ్రీ అర్హతతో SBIలో భారీగా ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ, వేతనం రూ.50వేలు..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!
-
అనంతగిరి తహసిల్దార్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు..!









