Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : క్రికెట్ పోటీలు ప్రారంభం..!

Miryalaguda : క్రికెట్ పోటీలు ప్రారంభం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్ (9వ వార్డు)లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అవుట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు, (5 వ వార్డ్) ఈదులగూడెం కౌన్సిలర్ ముదిరెడ్డి నర్సిరెడ్డి పాల్గొని టాస్ వేసి పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఉత్సాహంగా బ్యాటింగ్ బౌలింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ సోషల్ మీడియా కన్వర్ పాతూరి, శరత్, ఆర్గనైజర్ జాస్తి అమర్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్ దాత సామాజిక వేత్త మునీర్, టోర్నమెంట్ నిర్వాహకులు చిలివేరు కళ్యాణ్,

కుంభం సురేష్, నుమాన్, నిలం సురేష్, కృష్ణ, అనిల్, చింటూ, ఉపేందర్, శివ, సోహెల్, శ్రీను, ఇమ్రాన్, గణేష్, సందీప్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వల్లమల్ల రవికుమార్. చోల్లెటి ప్రవీణ్, బాలు నాయక్, విజయ్, శ్రీను , 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చక్రి నాయక్, జగన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు