Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయంపండుగలు

Kanuma : కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు.. కారణం ఉందా..!

Kanuma : కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు.. కారణం ఉందా..!

మన సాక్షి :

సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగను అతిపెద్ద పండుగగా చేస్తారు. దీనిని పెద్ద పండుగ అని కూడా పిలుచుకుంటారు. ఈ పండుగకు పల్లెల్లో రంగవల్లికలు, కొత్త అల్లుళ్ళు ఇంటికి రావడం, పిండి వంటలతో, భోగి మంటలతో, హరిదాసు కీర్తనలతో, గంగిరెద్దుల నాదస్వరాలతో సందడి ఉంటుంది.

ముఖ్యంగా ఈ పండుగ మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ జరుపుకుంటారు. కనుమ పండుగ రోజు ప్రయాణాలు చేయకూడదు అని అంటారు. కాకులు కూడా కదలవంటారు ఎందుకో తెలుసుకుందాం..

కనుమ పండుగ రోజు ప్రయాణాలు చేయకూడదని అనాదిగా వస్తున్న ఆచారం.. దాని ప్రకారం ఊరి పొలిమేరలు కూడా దాటకూడదు అంటారు. సంక్రాంతి పండుగకు ఊరెళ్ళిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణాలు చేయకూడదని పూర్వీకులు పేర్కొంటారు.

అయితే పల్లెల్లో కనుమ పండుగ రోజు రైతులు పశువులను పూజిస్తారు. పశువుల కొమ్ములకు రంగులు పూసి కాళ్లకు గజ్జలు కట్టి వాటిని పూజిస్తారు. వాటి మెడకు చిరుగంటలు కూడా కడతారు. హారతులు ఇచ్చి ఆహారాన్ని అందిస్తారు. కనుమ పండుగ రోజు పశువులకు విశ్రాంతిని కల్పిస్తారు.

పాత రోజుల్లో కనుమ రోజు పశువులను పూజించడం వల్ల ఎడ్ల బండ్లు కట్టేవారు కాదు. ఆరోజు ప్రయాణాలు చేయకుండా పశువులకు విశ్రాంతిని ఇవ్వటం మన సాంప్రదాయం. అందుకు కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అనేవారు. అంతేకాకుండా సంక్రాంతి పండుగ హడావిడిగా జరుపుకున్న వారంతా కనుమ రోజు కలిసి సరదాగా గడిపేందుకు కనుమ పండుగ రోజు ప్రయాణం చేయకూడదని అంటారు.

ఇప్పుడు ఎడ్ల బండ్లు లేవుగా కదా.. మోటార్ వాహనాలు ఉన్నాయి కాబట్టి ఎందుకు ప్రయాణించకూడదని అంటారు. కానీ సంవత్సరానికి ఒకసారి ఊరికి వస్తారు. ఇంకో రోజు మీ సొంత ఊరిలో మిత్రులతో బంధువులతో సరదాగా గడిపేందుకు కనుమ రోజు కూడా ఉండి వెళ్లాలని దాని అర్థం.

గమనిక : ఈ ఆర్టికల్ కు పూర్వీకుల ఆచారం ప్రకారం.. దీనిని పాఠకులకు అందించడం జరిగింది. ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

MOST READ : 

మరిన్ని వార్తలు