తెలంగాణBreaking Newsహైదరాబాద్

TG News : తెలంగాణలో మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!

TG News : తెలంగాణలో మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణలో మందుబాబులకు అదిరిపోయే శుభవార్త బీర్ల సరఫరా సంస్థలు చెప్పాయి. నిలిచిపోయిన బీర్ల సరఫరాను పునరుద్ధరించనున్నట్లు ఆ సంస్థలు వెల్లడించాయి. బీర్ల ధరలు పెంచాలని, పాత బకాయలు విడుదల చేయాలని డిమాండ్లతో సరఫరాను నిలిపివేసిన విషయం తెలిసిందే. దాంతో రాష్ట్రంలో బీర్ల నిల్వలు భారీగా పడిపోయాయి. దానిపై స్పందించిన బ్రేవరీస్ కంపెనీ బీర్ల సరఫరాను పునరుద్ధరించనున్నట్లు తెలిపింది.

తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు బీర్ల సరఫరాను వెంటనే అమలు చేయనున్నట్లు యు బి (UB) కంపెనీ ప్రకటించింది. అదేవిధంగా కింగ్ ఫిషర్ బీర్ల తయారీ కంపెనీ చేదువార్త చెప్పిన సంగతి కూడా తెలిసిందే. ఆ కంపెనీ బీర్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా ఆ స్టాక్ ఇటీవల పడిపోయింది. ఇప్పుడు చేసిన ఒకే ఒక్క ప్రకటనతో మళ్ళీ ఐదు శాతం పెరిగింది. అయితే తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు కెఎఫ్ బీర్లు సరఫరా పున ప్రారంభించాలని నిర్ణయించింది.

MOST READ : 

  1. TG News : వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. జాబితా రెడీ.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Banana : ఒక్క అరటిపండు రూ.100.. ఎక్కడో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..!

  3. Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)

  4. District collector : మహిళా ఉద్యోగులు స్వేచ్ఛగా పనులను చేసుకునేలా పోష్ యాక్ట్-23.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

  5. Jobs : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో కొలువుల జాతర..!

మరిన్ని వార్తలు