తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Nalgonda : పద్ధతి మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్తాం.. మాజీ ఎమ్మెల్యే కి హెచ్చరిక..!

Nalgonda : పద్ధతి మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్తాం.. మాజీ ఎమ్మెల్యే కి హెచ్చరిక..!

నల్లగొండ, మనసాక్షి :

నల్లగొండ మున్సిపల్ కమిషనర్ చాంబర్ లో ధర్నా పేరుతో కంచర్ల భూపాల్ రెడ్డి మంత్రి వెంకటరెడ్డిని ప్రభుత్వాన్ని తనను బూతులు తిడుతూ అరాచకం చేశాడని ఆయన తన పద్ధతిని భాషను మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్ వర్మ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి.మాజీ జడ్పీటీసీలు లక్ష్మయ్య పాశం రాంరెడ్డి లతో కల్సి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భూపాల్ రెడ్డి గతంలో కూడా బూతులు తిట్టాడని ఆయన కు చదువు సంస్కారం లేదని అన్నారు.

భూపాల్ రెడ్డి ధర్నా చేయాలనుకుంటే కమిషనర్ చాంబర్లో కాదని కార్యాలయం ముందు ధర్నా చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదన్నారు. ధర్నా పేరు చెప్పి కమిషనర్ ఛాంబర్ లో దాడులు చేస్తూ తన అనుచరులతో రౌడీలతో భయభ్రాంతులకు గురి చేశాడని పోలీసులు ఉండబట్టి ఆయన తమ కార్యకర్తల నుండి తప్పించుకున్నాడని లేని పక్షంలో వేరే విధంగా ఉండేది అన్నారు. ఆయన తిట్లను ఆయన అనుచరులే జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.

56 వేల ఓట్లతో ప్రజలు ఓడిస్తే సిగ్గు లేకుండా మళ్ళీ ఏదో వెలగబెడతామని ఆయన దుందుడుకుగా వ్య. జిల్లా అధ్యక్ష పదవి కోసమే ఆయన ఆరాటపడుతున్నాడని ఆ పదవి కోసం చేయరాని పనులు అనరాని మాటలు అంటూ కేసీఆర్ మెప్పుకోసం ప్రయత్నిస్తున్నడ ని అన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ జెడ్పిటిసిలు ఎంపీపీలు ఎంపీటీసీలు ప్రచారం లేకుండా గెలిచారని, ఆయన కు అధ్యక్ష పదవి వస్తె కాంగ్రెస్ నాయకులు సులభంగా గెలుస్తారని ఎద్దేవా చేశారు.

తాను మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన అనంతరం పట్టణాన్ని మంత్రి సహకారంతో 48 వార్డులలో అభివృద్ధి పనులు చేపట్టి ఇటువంటి రాజకీయ వివక్ష లేకుండా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కౌన్సిలర్లు అడిగిన ప్రతి అభివృద్ధి పనిని ఏ జెండాలో పొందుపరుస్తూ దానిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని నాలుగు సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో విసుగు చెందిన కౌన్సిలర్లు ఏడాది తమ పాలనలో సంతోషంగా ఉన్నారన్నారు.

అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు తీసుకువచ్చారని అలాగే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడానికి అమెరికా వెళ్లి మిషన్ తీసుకువచ్చి రెండు నెలలలో పనులు మొదలు పెట్టడానికి చర్యలు తీసుకున్నారన్నారు. 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో బ్రాహ్మణ వెల్లంల ఎస్ఎల్బీసీకి ఎందుకు నిధులు ఇవ్వలేదన్నారు.

విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి నల్గొండ నియోజకవర్గానికి ఒక్క సబ్ స్టేషన్ అయినా ఇచ్చాడా అని ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 8 సబ్ స్టేషన్ లు మంజూరు చేసి పనులు పూర్తి చేయిస్తున్నాడని అన్నారు. సంవత్సర కాలంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పనులను చూసి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఓర్వలేక అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో చులకన అవుతున్నారన్నారు.

మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తన పద్ధతిని భాషను మార్చుకోకుంటే వెంటపడి తగిన బుద్ధి చెప్తామని ఇంటికి వచ్చి కొడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన వ్యవహరిస్తే ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఈ సమావేశంలో పాశం రామ్ రెడ్డి కౌన్సిలర్ బషీర్ నవీన్ గౌడ్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు