TG News : కుల గణన సర్వే రిపోర్ట్.. బీసీ జనాభా లెక్క తేలింది.. అధికారికంగా ప్రకటించిన కమిటీ..!
TG News : కుల గణన సర్వే రిపోర్ట్.. బీసీ జనాభా లెక్క తేలింది.. అధికారికంగా ప్రకటించిన కమిటీ..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణలో బీసీ జనాభా లెక్క తేలింది. క్యాబినెట్ సబ్ కమిటీకి కులగణన నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికారులు అందజేశారు. తెలంగాణలో 50 రోజులపాటు అధికారులు సర్వే నిర్వహించారు. 96.9% కుటుంబాలను అధికారులు సర్వే చేయగా మరో 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదు. ఈ విషయాన్ని కమిషన్ స్పష్టం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 3.54 కోట్ల మందిని సర్వే చేసినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ ఆదివారం సమావేశమైంది. సమావేశానికి కమిషన్ నివేదిక అందజేసింది. కమిషన్ అందజేసిన కులగణన వివరాలు :
-
మొత్తం ఓసీల జనాభా 15.79%
-
ముస్లిం మైనార్టీల జనాభా 12.56%
-
ముస్లిం మైనార్టీ ఓసీల జనాభా 2.48%
-
బీసీల జనాభా 46.26%
-
ముస్లిం మైనార్టీల బీసీల జనాభా 10.08%
-
ముస్లిం మైనార్టీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56. 33 శాతం
-
ఎస్టీల జనాభా 10.45%
-
ఎస్సీల జనాభా 17.43 శాతం.
దేశంలోనే మొట్టమొదటి సర్వే
దేశంలో ఎక్కడా ఇలాంటి సర్వే జరగలేదు. బీసీ జనాభా లెక్కించాలనేదే రాహుల్ గాంధీ ఆశయమని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 103889 మంది ఎనిమిది ఎన్యుమరేటర్లతో కులగణన సర్వే జరిగిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3.54 కోట్ల మందిని సర్వే చేసినట్లు చెప్పారు. ఈనెల 4వ తేదీన క్యాబినెట్ సమావేశం జరగనున్నదని కులగనన సర్వే నివేదిక క్యాబినెట్ ముందుకు తీసుకురానున్నట్లు ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు.
MOST READ :
-
Miryalaguda : నల్గొండ జిల్లాలో ఫేక్ రిపోర్టర్ల గుట్టు రట్టు.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు.. పిడి యాక్ట్ నమోదు..!
-
Penpahad : కల్తీ విత్తనాలతో భారీగా నష్టం.. వ్యవసాయ అధికారులకు రైతు ఫిర్యాదు..!
-
TG News : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నిజమేనా.. సీఎంకు ఆ ఎమ్మెల్యే లేఖ..!
-
TG News : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నిజమేనా.. సీఎంకు ఆ ఎమ్మెల్యే లేఖ..!
-
District collector : కలెక్టరేట్ లో ప్రజావాణి రద్దు.. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..!









