తెలంగాణBreaking Newsజాతరలుజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District collector : పెద్దగట్టు జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : పెద్దగట్టు జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

సూర్యాపేట, మనసాక్షి :

శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు )జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ తెలిపారు. బుధవారం సూర్యాపేటలోని దురాజ్ పల్లి పెద్దగట్టు వద్ద సంబంధిత శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

పోలీస్ సిబ్బంది పెద్దగట్టు వద్ద బందోబస్తు ఏర్పాటు పకడ్బందీగా ఉండాలని, అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అలాగే పార్కింగ్ ప్రదేశాలు వద్ద, ట్రాఫిక్ నియంత్రణ, చేయుటకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించాలని అలాగే భక్తుల కొరకు ప్రవేశ ద్వారాలు నిష్క్రమణ ద్వారా వద్ద ప్రత్యేక నిగా ఏర్పాటు చేయాలని, విఐపి ల కోసం ప్రోటోకాల్ అధికారిని నియమించాలని, సూపర్ డెంటల్ ఆఫ్ పోలీస్ రవికుమార్ కు కలెక్టర్ తెలిపారు.

రెవెన్యూ అధికారులు అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పని చేయాలని దేవస్థానం చుట్టూ ఉన్న వ్యవసాయ భూములను స్వీకరించి పార్కింగ్ , తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు కొరకు భూమి చదును చేయడం, యాదవ పెద్దలకు సాంప్రదాయ వస్తువులు మరియు బట్టలు ఏర్పాటు చేయవలసిందిగా ఆర్డీవో వేణుమాధవ్ కు కలెక్టర్ తెలిపారు.

మున్సిపల్ కమిషనర్ శానిటేషన్, రోడ్లకు ఇరువైపున ఉన్న బుషెస్ తొలగింపు అలాగే తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం, గుట్టపైన మహిళల కొరకు డ్రెస్సింగ్ రూమ్ లో ఏర్పాటు, అలాగే మూడు షిఫ్టులలో 24 గంటలు పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చేయడం అన్ని పార్కింగ్ ప్లేస్ ల వద్ద టవర్ లైట్లు, గుడి చుట్టూ ఉన్న రోడ్లకు లైట్లు ఏర్పాటు, చేయాలని అలాగే స్టాల్స్ కొరకు ఆయా శాఖల వారికి టెంట్లు, బల్లలు, కుర్చీలు ఏర్పాటు 5 జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని, అవసరమగు ప్రాంతాలలో టాయిలెట్స్ నిర్మాణం చేయాలని, గట్టుకు చుట్టుపక్కల ఏర్పాటును కమిషనర్ పరిశీలించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

అలాగే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పరచాలని, పార్కింగ్ ప్లేస్ ల వద్ద భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాల వద్ద త్రాగునీటి కొరకు పంపులు ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీ సిబ్బంది పారిశుధ్యం మరియు ఇతర పనులు పరిరక్షించడానికి పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బందిని నియమించాలని కలెక్టర్ తెలిపారు. విద్యుత్ అధికారులు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నిచోట్ల లైట్ల ఏర్పాట్లు ఉండాలని అలాగే జాతరకోవచ్చు భక్తుల అహల్లాదం కోరకు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసిన పిదప అన్ని వినోద వస్తువులతో ట్రైలర్ రన్ నిర్వహించాలని, అనుమతులు నిబంధనలకు కచ్చితంగా పాటించాలన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రధమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు, అలాగే వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా విధులు ఏర్పాటు చేయాలని దగ్గరలో ఉన్న పీహెచ్సీ లలో సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిఎం అండ్ హెచ్ ఓ కోటాచలం కు ఆదేశించారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఆలయం చుట్టూ కలర్ లైటింగ్ ఏర్పాట్లు, అవసరమైన చోట ప్రసాద్ కౌంటర్లు అమర్చటం అలాగే ఆలయం పైన ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని జాతర జరుగుటైంలో కామన్ కంట్రోల్ నెంబర్ ఏర్పాటు చేయాలని, దీనికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఈసారి జాతరకు 16వ తేదీన సాయంత్రం నుండి 18వ తేదీ వరకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఈవో కుశలయ్య తెలిపారు. గుట్ట పైన స్నానాలు చేసిన పిమట దుస్తులు మార్చుకొనుటకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని ,కళ్యాణ కట్ట వద్ద తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. దేవాలయంలోకి దర్శనానికి వచ్చే వీఐపీలకు రెవెన్యూ మరియు ఎండోమెంట్ సిబ్బంది సమన్వయంతో దర్శనాలు కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథ అధికారులు భక్తులకు తాగునీరు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

తాత్కాలిక మరుగుదొడ్లు బాత్ షవర్లు తగినంత నీటి సరఫరా జరిగె విధంగా ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు లింగమంతుల స్వామి జాతరకు వచ్చే అన్ని రోడ్లను పరిశీలించి, బషెస్ ను తొలగించి రోడ్లను భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలన్నారు. ఆర్ అండ్ బి అధికారులు దేవస్థానం వద్ద క్యూలైన్, మెట్లు ,చెరువు చుట్టూ బార్కెట్లు, చెరువుచుట్టూత బార్కెట్స్ తో పాటు ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిమాపక సిబ్బంది కంట్రోల్ రూమ్ వద్ద ఒక పెద్ద అగ్నిమాపాక యంత్రం, పార్కింగ్ ప్లేస్ వద్ద అగ్ని మాపక యంత్రం ,రెండు మొబైల్ వెహికల్స్ కూడా సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ జిల్లా అభిమాపక అధికారికి ఆదేశించారు.

ఆర్టీసీ సిబ్బంది తాత్కాలిక బస్టాండ్ ల ఏర్పాటు, అలాగే బస్సులు సులువుగా వెళ్లడానికి రావడానికి రోడ్డు మార్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ప్రదేశాల నుండి వచ్చే బస్సులకు ఏర్పాట్లు చేయాలని, అలాగే బస్సుల ద్వారా ప్రముఖ ప్రదేశాలకు జాతర గురించి తెలిసే విధంగా గోడ పత్రికలు అందించాలని కలెక్టర్ తెలిపారు. ఎక్సైజ్ శాఖ వారు ముఖ్యమైన కూడళ్ల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి పరిశీలించాలన్నారు. జాతర జరిగే సమయంలో ఆహార కమిటీలు ఆహార పదార్థాలు విక్రయించే వద్ద పరిశీలించాలని భక్తులకు పరిశుభ్రమైన ఆహారం అందేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.

జాతర జరుగు సమయంలో మీడియా మిత్రులకు అన్ని ఏర్పాట్లు చూడాలని అలాగే సంస్కృతిక కార్యక్రమాలు ,అన్ని కార్యక్రమాలను విడియో కవరేజీ, పోస్టర్ల ముద్రణ, అన్ని ప్రాంతాలకు గోడపత్రికలు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జాతర జరుగు సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు తమ సేవలు అందించాలని ,జాతర విజయవంతానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు, లింగమంతుల స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోలబోయిన నరసయ్య యాదవ్, ఆర్డిఓ వేణుమాధవ రావు, సిపిఓ ఎల్ కిషన్, డి.ఎస్.పి రవికుమార్, జిల్లా వైద్య అధికారి కోటాచలం, డిపిఓ నారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,

ఎండోమెంట్ ఈవో కుశలయ్య, కలెక్టరేటే ఎవో సుదర్శన్ రెడ్డి , సూపర్నెంట్ పద్మారావు, తాసిల్దారులు శ్యాంసుందర్ రెడ్డి, కృష్ణయ్య, పంచాయతీరాజ్ ఈఈ మాధవి,ae రాహూల్,ఈఈ ఆర్డబ్ల్యూఎస్ వైస్ శ్రీనివాసరావు ,గ్రిడ్ అరుణాకర్ రెడ్డి, డి టి ఓ సురేష్ రెడ్డి ,ఫైర్ ఆఫీసర్ నారాయణ, డి ఎం ఆర్ టీసీ డి సుందర్. ప్రజా ప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ.. ముందుగా వారికే.. బిగ్ అప్డేట్..!

  2. Gold Price : గోల్డ్.. ఆల్ టైం రికార్డ్.. లేటెస్ట్ అప్డేట్..!

  3. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. వారికి కూడా కాల్ చేయొచ్చు..!

  4. Panchayat Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు