Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

Seeds : నకిలీ విత్తనాలతో నిండా మునిగిన రైతులు.. వరి పొలాలు సందర్శించిన కోదండరెడ్డి..! 

Seeds : నకిలీ విత్తనాలతో నిండా మునిగిన రైతులు.. వరి పొలాలు సందర్శించిన కోదండరెడ్డి..! 

సూర్యాపేట, మనసాక్షి :

నకిలీ విత్తన కంపెనీల నుండి రైతులను కాపాడుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిషన్ సభ్యులు నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన పెన్ పహాడ్ మండలం పొట్లపహాడ్ గ్రామ రైతులు పొలాలను సందర్శించారు.

ఈ సందర్బంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ గరిడేపల్లి మండలం గడ్డిపల్లి లోని వెంకటసాయి సీడ్స్ వారి నుండి కొనుగోలు చేసిన సిరి 101,కావేరి సింట్లు అనే రకానికి చెందిన వరి విత్తనాలు నాటు పెట్టిన 40 రోజులకే ఈనటం మొదలు అయిందని ఇట్టి విషయం రాష్ట్ర వ్యవసాయ కమిషన్ దృష్టికి రావటంతో వరి నాటు పెట్టిన 75 రోజుల తర్వాతనే ఈనటం మొదలు అవుతుంది కానీ 40 రోజులకే ఈనటం ఏంటి అని తెలుసుకెనేందుకే వ్యవసాయ కమిషన్ సభ్యులతో కలిసి క్షేత్ర స్థాయి లో పర్యటించామని తెలిపారు. భాధిత రైతులు సంబంధిత కంపెనీ వారితో మాట్లాడగా వాతావరణం వల్ల ఇలా జరిగిందని అంటున్నారని వారు మాతో తెలిపారని అన్నారు.

వాతావరణం లో మార్పుల వల్ల వరికి తెగుళ్లు వస్తాయి కానీ నాటిన 40 రోజులకే ఈనదని అవి నకిలీ విత్తనాల వల్లే ఈ సమస్య వచ్చిందని,అట్టి విత్తనాలు మెరుగైన సర్టిపైడ్ విత్తనం కాదని నకిలీ విత్తనం అని నిర్దారణ అయిందని తెలిపారు.

నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయారని ఇట్టి విషయాన్నీ నివేదిక రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెల్తామని అన్నారు .ఇప్పటికైనా కంపెనీలు వ్యాపారం దృష్ట్యా ఆలోచించకుండా రైతు నష్టపోకుండా రైతు బాగు కోరి విత్తనాలు తయారు చేయాలని సూచించారు .

తదుపరి జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ డీలర్ షిప్ అనుమతి,సర్టిపికెట్ ఉన్న విత్తన కంపెనీలు మాత్రమే విత్తనాలు అమ్మే లా చూడాలని అన్నారు.

జిల్లాలో ఎన్ని ఎకరాలలో వరి, ఇతర పంటలు సాగు చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు.?తదుపరి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనుమతి ఉన్న డీలర్ల్, సర్టిపికెట్ ఉన్న విత్తనాల శాంపిల్స్ సేకరించి పరిశీలన చేసిన తర్వాతనే రైతులకి విత్తనాలు విక్రయించేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమం లో వ్యవసాయ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న,సునీల్,రాంరెడ్డి గోపాల్ రెడ్డి, భవాని,జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఈ సెక్షన్ సూపరిటీడెంట్ సాయగౌడ్, వ్యవసాయ శాఖ పరిపాలన అధికారి ఆశా కుమారి, సూపరిటీడెంట్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

Gold Price : బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా.. అందరూ తెలుసుకోవాల్సిందే..!

Penpahad : కల్తీ విత్తనాలతో భారీగా నష్టం.. వ్యవసాయ అధికారులకు రైతు ఫిర్యాదు..!

Rythu Bharosa : రైతు భరోసా.. 17.03 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.533 కోట్లు జమ.. చెక్ చేసుకోండి..!

District collector : పెద్దగట్టు జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

మరిన్ని వార్తలు