Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Rythu Bharosa : రైతు భరోసా గందరగోళం.. వారికి రానట్లేనా.. అధికారులు ఏమంటున్నారంటే..!

Rythu Bharosa : రైతు భరోసా గందరగోళం.. వారికి రానట్లేనా.. అధికారులు ఏమంటున్నారంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం గందరగోళంగా మారింది. ప్రభుత్వం ఇప్పటివరకు మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు నిధులు విడుదల చేసినప్పటికీ రైతుల ఖాతాలలో కొద్ది మందికే డబ్బులు జమ అవుతున్నాయి. మిగతా రైతులు ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు ద్వారా ఎకరానికి పదివేల రూపాయలు రెండు విడతలుగా అందజేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పట్టాదారు పాసుబుక్ ఉన్న ప్రతి రైతుకు బ్యాంకు ఖాతాలలో రైతుబంధు డబ్బులు జమ అయ్యాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని 2025 జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు మూడు విడతలుగా మూడు ఎకరాలలోపు ఉన్న రైతులకు 3487.25 కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేసినట్లుగా చెబుతోంది. కానీ అందరి రైతులకు రైతుల ఖాతాలలో డబ్బులు జమ కాలేదు. మిగతా రైతులు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.

వ్యవసాయ అధికారులు ఏమంటున్నారంటే..?

రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలలో జమ కాలేదని రైతులు వ్యవసాయ కార్యాలయాలకు తిరుగుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారుల దృష్టికి రైతులకు తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

ఇంకా కొంతమందికి రైతుల ఖాతాలలో డబ్బులు జమ కాలేదు.. అవుతాయనే సమాధానం తప్ప.. ఎప్పుడు అవుతాయో..? అనేది కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ విధంగా రైతులు వ్యవసాయ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది.

కొత్తవారికి వచ్చేనా..?

ప్రభుత్వం కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింప చేస్తామని ప్రకటించింది. జనవరి 31వ తేదీ 2025 వరకు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు కూడా ప్రతి భరోసా అందజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. కానీ ఇప్పటివరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు రైతు భరోసా అందలేదు. పాత వారికే అందలేదని ఆందోళన చెందుతుండగా కొత్తవారికి రైతు భరోసా వస్తుందా..? రాదా..? అనే పరిస్థితిలో ఉన్నారు.

■ Similar News : 

  1. Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. మూడు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల..!

  2. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ కాలేదా.. అయితే ఇలా చేయండి..!

  3. Rythu Bharosa : రైతులకు భారీ షాక్.. వారికి రైతుభరోసా కట్..!

  4. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పడలేదా.. అయితే ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు