Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంఖమ్మం జిల్లా

అనుమానస్పద స్థితిలో బీహార్ హమాలీ మృతి..!

అనుమానస్పద స్థితిలో బీహార్ హమాలీ మృతి..!

నేలకొండపల్లి, మన సాక్షి :

ఓ రైస్ మిల్లులు బీహార్ కు చెందిన హమాలీ అనుమానస్పద స్థితిలో అమృతి చెందాడు… స్థానికుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం లోని పైనంపల్లి సమీపం లోని పద్మావతి శ్రీనివాస్ బాయిల్ రైస్ మిల్లులో బీహార్ కు చెందిన హమాలీ మహమ్మాద్ ఇంతియాజ్ (51) గురువారం మృతి చెందాడు.

బీహార్ కు చెందిన ఇంతియాజ్ గత కొంత కాలంగా మిల్లులో హమాలీ పనులు చేస్తున్నాడు. గురువారం తెల్లవారు జామున చూడగా..చనిపోయి ఉన్నాడు. మిల్లులోని వడ్ల ను స్టోర్ చేసే డ్రయర్ పై నుంచి కింద పడి చనిపోయినట్లు తెలుస్తుంది.

కాగా అంత ఎతైనా డ్రయర్ ను ఎందుకు ఎక్కాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది. మిల్లు ఆడుతున్న సమయంలో కాకుండా రాత్రి సమయంలో మిల్లుకు ఎందుకు వచ్చాడు అనే విషయం -తెలియాల్సి ఉంది. మృతి పై మిల్లు యాజమానులు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Gold Price : వరుసగా రెండో రోజు కుప్పకూలిన బంగారం ధర..!

  3. TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రేషన్ కార్డులు కట్..!

  4. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఎంపీడీవో, ఎంపీవో సస్పెండ్..!

  5. Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!

మరిన్ని వార్తలు