TG News : తెలంగాణలో మహిళలకు కుటుంబ భరోసా కు రూ.10 లక్షలు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!
TG News : తెలంగాణలో మహిళలకు కుటుంబ భరోసా కు రూ.10 లక్షలు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!
తెలంగాణ బ్యూరో, మన సాక్షి :
తెలంగాణలో మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి శుభవార్త తెలియజేస్తుంది. ఈ సందర్భంగా మహిళా దినోత్సవానికి మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు.
మహిళ సంఘాలలో చేరేందుకు 60 సంవత్సరాలు దాటిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలలోపు వారు కూడా మహిళా సంఘాల్లో సభ్యులుగా చేరే అవకాశం ఉందని ఆమె తెలిపారు. మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉండి ఏదైనా ప్రమాదంలో మృతి చెందితే వారికి 10 లక్షల రూపాయల కుటుంబ భీమాను అందిస్తున్నట్లు సీతక్క ప్రకటించారు.
అదేవిధంగా రైస్ మిల్లులు నడుపుకునే విధంగా మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ సోదరుడిగా అండగా ఉంటూ ప్రజా పాలన సాగిస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ అంటేనే మహిళలకు సమాన పనికి సమాన వేతనం అనేది లింగ వివాక్ష ఉండకూడదు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్దిక వెసులుబాటు కల్పిస్తుంది అన్నారు.
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. మహిళా సంఘాలకు వ్యాపారం చేసుకోవడానికి వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 21 వేల కోట్ల రూపాయలకు పైగా మహిళలకు రుణాలు ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
పెట్రోల్ బంకులు, గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ, పాడి పశువుల పెంపకం వంటి వినూతల పథకాలను కాలంలోనే ప్రారంభించినట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ మహిళల కోసం బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందిస్తుందని, కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు.
MOST READ :
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
-
Galaxy Health insurance : అదిరిపోయే టాప్-అప్‌తో గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!
-
Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!









