TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!
TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నూతన పథకాన్ని రూపొందించింది. నిరుద్యోగ యువతను ఆర్థిక సహాయం రాజీవ్ యువ వికాస పథకం ద్వారా ప్రభుత్వం ఆదుకోనున్నది. ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మందికి ఈ సహాయం అందజేస్తారు. 6000 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ సహాయం అందజేయబడుతుంది.
నేటి నుంచి దరఖాస్తులు :
దరఖాస్తుల ప్రక్రియను మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. దరఖాస్తులకు నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర ఆర్థికంగా వెనుకబడిన యువకులు దరఖాస్తులు చేసుకోవచ్చును. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ మే 31 పూర్తవుతుంది. అర్హులైన అభ్యర్థులు (ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మైనార్టీస్ సిస్టం)
OBMMS (Online Beneficiary Management & Monitoring System)
పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును.
రాజీవ్ యువ వికాస పథకం :
తెలంగాణలోని ఉద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధి కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది యువతీ యువకులకు దీని ద్వారా లబ్ధి చేకూరాలని ఉన్నది.
అర్హతలు :
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు తెలంగాణ రాష్ట్ర నివాసితులై ఉండాలి. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు ప్రాధాన్యత కల్పిస్తారు. వ్యాపార ఆలోచన లేదా ప్రాజెక్టు ప్రణాళికను సమర్పించాల్సి ఉంటుంది.
సహాయం ఎలా అందిస్తారు :
నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అందించే సహాయం సబ్సిడీ రూపంలో లేదా తక్కువ వడ్డీ రుణాల రూపంలో అందజేయబడుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ నిధులు పంపిణీ చేయబడతాయి. ఈ పథకాన్ని జిల్లా స్థాయిలో అమలు చేయడానికి కమిటీలను ఏర్పాటు చేసింది. దరఖాస్తుల ఎంపికలో పారదర్శకతను నిర్ధారించడానికి ఆన్లైన్ వ్యవస్థను ఉపయోగిస్తారు.
దరఖాస్తు ఎలా చేయాలి?
అధికారిక వెబ్ సైట్ OBMMS (Online Beneficiary Management & Monitoring System) లేదా తెలంగాణ ప్రభుత్వ పోర్టల్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యార్హతలు, వ్యాపార ప్రణాళికను సమర్పించాల్సి ఉంటుంది.
MOST READ :
-
UPI : యూపీఐ చెల్లింపుల్లో నయా మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..!
-
Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!
-
TG News : ఆరోగ్యశ్రీ నిబంధనల్లో మార్పు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!
-
PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. సైబర్ నేరాలకు చెక్..!
-
TG News : తెలంగాణలో వారికి గ్రీన్ కార్డులు.. బిగ్ అప్డేట్..!









