Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసంగారెడ్డి జిల్లా

Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..! 

Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..! 

కంగ్టి, మన సాక్షి :

తెలంగాణలో రైతులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేయడానికి దరఖాస్తులు ఆహ్వానించింది.  అర్హులైన రైతులను గుర్తించి వారికి సబ్సిడీపై పరికరాలను ప్రభుత్వం అందజేయనున్నది.

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని రైతులు తెలంగాణ ప్రబుత్వం వ్యవసాయ శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ రాయితీ పై వ్యవసాయ పరికరాలను అందించడానికి ధరకాస్తు ప్రక్రియ ప్రారంభం అయిందని ఏవో హరీష్ పవార్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అర్హులు పట్టా పాస్ పుస్తకం కలిగిన ఎస్సీ, ఎస్టీ, జనరల్, మహిళలు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, రైతులకి 50 శాతం రాయితీ జనరల్ రైతులకి 40 శాతం రాయితీ, అందించబడును, రూ. లక్ష లోపు లబ్ది పొందు రైతులు కనీసం ఒక ఎకరం లోపు భూమి కలిగి ఉండాలి.
రూ. లక్ష లేదా అంతకన్నా ఎక్కువ లబ్ది పొందు రైతులు ఖచ్చితంగా ఒక ఎకరం భూమి కలిగి ఉండాలి.

“యంత్రపరికరాల వివరాలు “
* నాప్సాక్ స్ప్రయెర్
* బ్యాటరీ స్ప్రయర్
* రోటవేటర్
* సీడ్ కమ్ ఫెర్టీలైజర్ డ్రిల్
* డిస్క్ హ్యారో
* కల్టివేటర్
* ఎంబి ప్లవ్
* కేజ్వీల్
* పవర్ వీడర్
* పవర్ టిల్లర్
* బ్రష్ కట్టర్
* బండ్ ఫార్మర్
” ఎంపిక విధానం ”
ధరకాస్తు దారులు ధరకాస్తు చేసుకున్న అనంతరం మండల స్థాయిలో నియమించిన కమిటీ సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఇట్టి కమిటీ కి కన్వీనర్ గా మండల వ్యవసాయాధికారి ఉంటారు. మరియు మెంబర్లుగా తహసీల్దారు ,ఎంపిడిఓ లు వ్యవహరిస్తారు.

దరఖాస్తుకు ఆఖరు 24 : 

దరఖాస్తుకు కావలసిన ప్రతులు , ధరకాస్తు ఫారం,  పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు,ట్రాక్టర్ కు, సంబంధించిన పరికరాలకి ఆర్సి జీరక్స్ , పాస్ ఫోటో,
నేల సారం కు సంబంధించిన సాయిల్ హెల్త్ కార్డు తప్పనిసరి, బ్యాంక్ పాసు పుస్తకం,ఈ ఆర్థిక సంవత్సరం ఈ నెల చివర్లో ముగిస్తున్నందున ఈ నెల 24 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే లబ్ధి పొందగలరు. కావున త్వరితగతిన మండల వ్యవసాయ కార్యాలయంలో గానీ, ఏ ఈ ఓల వద్ద కానీ దరఖాస్తు చేసుకోగలరని మండల వ్యవసాయ అధికారి హరీష్ పవార్ తెలిపారు.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!

  2. WhatsApp : మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. ఎలా చేస్తారంటే.. బిగ్ అలర్ట్..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!

  4. TG News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త..! 

  5. District SP : ప్రజల భద్రతపై భరోసా కల్పించాలి.. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!

మరిన్ని వార్తలు