తెలంగాణBreaking Newsఉద్యోగం

TG News : ఉద్యోగార్దులకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది బహుమతి..!

TG News : ఉద్యోగార్దులకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది బహుమతి..!

Mana Sakshi : తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్దులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ గిఫ్ట్ ఇచ్చారు. ఆదివారం ఉగాది పర్వదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ పండుగ సంబరాల వేళ గ్రూప్ 1 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా ఉద్యోగాలకు మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలు రేవంత్ సర్కారు విడుదల చేసింది.

గత ఏడాది మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ప్రిలిమ్స్ పరీక్షలు అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్షను ఎంపిక చేసి మెయిన్స్ రాత పరీక్ష కూడా నిర్వహించారు.

ఇప్పటికే ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ లను కూడా విడుదల చేసింది. వాటిపై అభ్యంతరాలు పరిగణలోకి తీసుకొని తాజాగా జనరల్ ర్యాంక్ లిస్టులో విడుదల చేసింది. జనరల్ ర్యాంకింగ్ కూడా అధికారిక వెబ్‌సైట్ లో పెట్టినట్లుగా ఆ సంస్థ చైర్మన్ బుర్ర వెంకటేశం ఆదివారం పేర్కొన్నారు.

ఇదివరకు విడుదల చేసిన ప్రొవిజినల్ మార్క్ లిస్ట్ లను ఆధారంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టులో విడుదల చేసామని పేర్కొన్నారు. త్వరలో కేటగిరి వారిగా ర్యాంకింగ్ జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. అప్పటిలోగా అభ్యర్థులు తమ మార్కులు, ర్యాంకులను సరిచేసుకోవాలని అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. ఉగాది పర్వదినం సందర్భంగా గ్రూప్ 1 జనరల్ ర్యాంక్ లిస్టులో విడుదల చేయడం ద్వారా రేవంత్ సర్కార్ ఉద్యోగార్దులకు పండగ సంబరాలను అందించింది.

MOST READ : 

  1. Hyderabad : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపర్ న్యూస్..!

  2. WhatsApp : వాట్సాప్ స్టేటస్ అదిరిపోయేలా సాంగ్ యాడ్ చేయొచ్చు తెలుసా.. ఎలా అంటే..!

  3. TG News : తెలంగాణ సర్కార్ షాక్.. 6729 మంది ఉద్యోగుల తొలగింపు.. ఉత్తర్వులు జారీ..!

  4. Gold Price : ఎవరెస్ట్ ఎక్కిన గోల్డ్ ధర.. తులం ఎంతంటే..!

  5. Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!

మరిన్ని వార్తలు