50years : 50 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!
50years : 50 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!
సూర్యాపేట, మనసాక్షి :
50 ఏళ్ల క్రితం చదువుకున్న విద్యార్థులు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కలుసుకొని ఘనంగా స్వర్ణోత్సవ సమ్మేళనం నిర్వహించారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 1973-75 విద్యా సంవత్సరం లో ఇంటర్మీడియట్ బైపిసి కి చెందిన పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత కలుసుకొని తమ చిన్న నాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. జూనియర్ కళాశాల 50 ఏళ్ల క్రితం చదువుకున్న రోజులను గుర్తు చేసుకొని సరదాగా గడిపారు.
ఒకరినొకరు తమ బాగోగులు తెలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ కార్యక్రమా నికి హాజరైన పూర్వ విద్యార్థి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ వర్దేల్లి మురళి మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం చదువుకున్న తాము ఈ వయసులో కలుకోవడం పునరుత్తేజాన్ని ఇచ్చిందన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శంకర్, శ్యాంసుందర్, అశోక్, ఉప్పల రాజేంద్రప్రసాద్, నరేందర్ రెడ్డి, పిచ్చిరెడ్డి, రంగారెడ్డి, అశ్విని కుమార్, నరసింహారావు, డాక్టర్ రామచంద్రరావు, జగన్, పృథ్వి రంజన్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Womens: మహిళలకు భారీ శుభవార్త.. వారి కోసం కొత్త పథకం..!
-
Miryalaguda : సన్న బియ్యం పథకం దేశానికి ఆదర్శం..!
-
Miryalaguda : గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం.. మిర్యాలగూడ సిరిమువ్వ నాట్యలయ చిన్నారులు..!
-
Viral Video : మెట్రో స్టేషన్లో ఇదేం పాడు పని రా బాబు.. (వీడియో వైరల్)
-
Nalgonda : కలర్ ల్యాబ్ యజమాని దారుణ హత్య.. ఉలిక్కిపడిన నల్లగొండ..!









