Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : పదవ తరగతి ఫలితాల్లో ఎస్పిఆర్ విద్యార్థుల ప్రభంజనం..!

Miryalaguda : పదవ తరగతి ఫలితాల్లో ఎస్పిఆర్ విద్యార్థుల ప్రభంజనం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన ఎస్పిఆర్ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించారు.

పాఠశాలకు చెందిన కృత్తిక రెడ్డి 600 మార్కులకు గాను 580 మార్కులు సాధించారు. అదేవిధంగా నస్రీన్ 577 మార్కులు, వి రెడ్డి ప్రణవి 576 మార్కులు, ప్రియదర్శిని 575 మార్కులు, గురు పద్మశ్రీ 575 మార్కులు, ఎస్.కె నదీన్ 573 మార్కులు, బి శరణ్య 571 మార్కులు, సిహెచ్ కరుణ 570 మార్కులు సాధించారు.

అదేవిధంగా 20 మంది విద్యార్థులు 550 మార్కులకు పైగా సాధించగా 66 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారు.ఎస్ పి ఆర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు 108 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు.

కాగా అద్భుతమైన ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ యామిని వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు గార్లపాటి ఉమాకర్ రెడ్డి, జొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డి, నాదెండ్ల అయ్యన్న, నీలిమారెడ్డి, ఎస్ పి ఆర్ సెమి రెసిడెన్షియల్ ప్రిన్సిపల్ కొనుగంటి శ్రీనివాస్ రెడ్డి, రోహిత్ కుమార్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అభినందించారు.

MOST READ :

  1. Thati Kallu : తాటి కల్లు ఆరోగ్యనికి మంచిదేనా.. తెలుసుకుందాం..!

  2. Miryalaguda : ఇష్టానుసారంగా ప్రైవేట్ ఆస్పత్రులు.. అధికారుల తనిఖీలు, నోటీసులు..!

  3. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు.. జడ్పీ సీఈఓ కు ఫిర్యాదు..!

  4. Miryalaguda : నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక, ప్రమాణ స్వీకారం..! 

  5. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు.. జడ్పీ సీఈఓ కు ఫిర్యాదు..!

మరిన్ని వార్తలు