Nalgonda : నల్గొండ జిల్లాలో వైద్యాధికారి సంచలన నిర్ణయం.. నాలుగు ఆసుపత్రులకు నోటీసులు..!
Nalgonda : నల్గొండ జిల్లాలో వైద్యాధికారి సంచలన నిర్ణయం.. నాలుగు ఆసుపత్రులకు నోటీసులు..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మికంగా ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేశారు. పి సి, పి ఎన్ పి టి యక్ట్ ప్రకారం తనిఖీ నిర్వహించడం జరిగింది అని జిల్లా అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవరకొండ పట్టణంలోని ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో విధిగా కన్సటెన్సీ ఫీజుల వివరాలు పేషెంట్స్ కనిపించే విధంగా గోడలకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యంగా ల్యాబ్ లో పని చేసే ప్రతి ఒక్కరికి ల్యాబ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ కనిపించే విధంగా ఉండాలని సూచించినారు.
డాక్టర్ల క్వాలిఫికేషన్ వారి సర్టిఫికెట్లు పరిశీలించారు. అనుమతి లేని ఆసుపత్రులను మూసివేస్తామని హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్లలో వివిధ రేటియోలజిస్ట్ ఉండాలని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులలో ఓపి ఎక్కువ తీసుకుంటే, ఆస్పత్రులలో వైద్యులు సమయపాలన పాటించకుంటే, ల్యాబ్ టెస్ట్ లకు ఎక్కువ పైసలు అడుగుతే జిల్లా అధికారి డిఎంహెచ్వో దృష్టికి తీసుకురావాలని అన్నారు.
హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు కలిగి ఉండాలని అన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిఎంహెచ్వో తనిఖీలో భాగంగా ఏడు ఆసుపత్రులను తనిఖీ చేసిన సందర్భంలో ఐదు ఆస్పత్రులను నోటీసులు ఇవ్వడం జరిగింది అన్నారు.
నోటీసులు ఇచ్చిన ఆస్పత్రులు
1) బాల విజయ సాయి హాస్పిటల్
2) అప్రోకేర్ డయాగ్నస్టిక్
3) ఎస్ ఆర్ స్కాన్ సెంటర్
4) జ్యోతి హాస్పిటల్
నోటీసులు ఇచ్చిన నాలుగు ఆసుపత్రులలో సరైన పి సి, పి ఎన్ పి టి రిజిస్టర్లు, స్కాన్ ఫామ్ లు చూపించకపోవడం వలన నోటీసులు ఇవ్వడం జరిగిందని జిల్లా వైద్య అధికారి పుట్ల శ్రీనివాస్ తెలిపారు.
డీఎంహెచ్వో వెంట డిప్యూటీ డిఎంహెచ్వో దేవరకొండ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, మిర్యాలగూడ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ రవి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ అరుంధతి, ఐఈ డెమో బి నర్సయ్య, సిహెచ్ఓ హరిలాల్, హెచ్ యు లు విజయ ప్రసాద్, కలీం, షీ టీం ఏఎస్ఐ సుల్తానా, సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
District Collector : ధాన్యం తరలింపు లారీ కాంట్రాక్టర్ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు..!
-
TUWJ : టి యు డబ్ల్యూ జె (హెచ్ – 143) నల్గొండ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా మల్లె నాగిరెడ్డి..!
-
Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. బైక్ కనిపిస్తే ఖతమే..!
-
TATA AIG : తెలుగు రాష్ట్రాల్లో 3 రెట్ల వృద్ధి సాధించిన టాటా ఏఐజీ..!
-
Miryalaguda : ఇష్టానుసారంగా ప్రైవేట్ ఆస్పత్రులు.. అధికారుల తనిఖీలు, నోటీసులు..!









