తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : ఫామ్ హౌస్ లో కేసీఆర్.. బోట్ క్లబ్ లో భాస్కరరావు.. కాంగ్రెస్ నాయకుల తీవ్ర ఆరోపణలు..!

Miryalaguda : ఫామ్ హౌస్ లో కేసీఆర్.. బోట్ క్లబ్ లో భాస్కరరావు.. కాంగ్రెస్ నాయకుల తీవ్ర ఆరోపణలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే బోట్ పార్కులో ఉంటారనే విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు.

శనివారం స్థానిక మినీ రవీంద్రభారతిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ వాళ్లు ఇదే వేదికగా శాసనసభ్యులు బిఎల్ఆర్ పై అవాకులు చవాకులు పేలుతూ మాజీ శాసనసభ్యులు భాస్కర్ రావు చేసినటువంటి అవినీతి పనులను కప్పిపుచ్చుకోవటానికి మసి పూసి మారేడు కాయ చేయాలనే ఉద్దేశంతో వారు నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం జరిగిందన్నారు.

మినీ రవీంద్ర భారతి పేరుని ఎలాంటి అనుమతులు లేకుండా వారి ఇష్టారాజ్యంగా కెసిఆర్ కళాభారతిగా నామకరణం చేయడం ఎంతవరకు సమంజసమో తెలపాలన్నారు. అదేవిధంగా ఈ మినీ రవీంద్ర భారతి 2006లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైపాల్ రెడ్డి తీసుకు వచ్చినటువంటి నిధులతో శంకుస్థాపన చేసుకుని దాని నిర్మాణ ప్రారంభం చేయడం జరిగిందని ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి 1.30 కోట్లు ఫండ్ తీసుకురావడం జరిగిందన్నారు.

మిగిలిన మొత్తాన్ని టి ఎఫ్ యు ఐ డి సి నిధుల ద్వారా తీసుకువచ్చి దాదాపుగా 9 కోట్ల వ్యయంతో ఈ మినీ రవీంద్రభారతిని నిర్మాణం చేయడం జరిగిందన్నారు. దీనిలో మొదటగా కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వారు నష్టపోయే విధంగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బిల్లు రాకుండా చేసి వారిని దివాలా తీయించి ఆ వర్కులను భాస్కర్ రావు వారి బినామీలకు ఇప్పించి ఎస్టిమేట్లను పలుమార్లు మార్చి బిల్లులు ఎక్కువగా రాయించుకొని నాసిరకం పనులు చేసినటువంటి ఘనత మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు దేనిని అన్నారు.

భాస్కర్ రావు నిన్న మాట్లాడుతూ సెంట్రల్ ఏసి చేయించానని చాలా గొప్పగా చెప్పుకున్నారని కానీ, కూలర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ పేరుని పెట్టి బిల్లులు పాస్ చేయించుకోవాలని దుర్దేశంతో కేసీఆర్ కళాభారతిగా పేరు పెట్టారని అధికారికంగా దానికి ఎలాంటి ఆనవాళ్లు లేవని అది కేవలం మినీ రవీంద్ర భారతి గానే పిలవబడుతుందన్నారు.

అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు క్యాంప్ ఆఫీస్ ఆయన కట్టించిందని అందులో ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఉండవద్దని అవాకులు చివాకులు మాట్లాడారని, అయితే క్యాంప్ ఆఫీస్ అనేది కేసీఆర్ అబ్బ సొత్తు గానీ భాస్కరరావు అబ్బ సొత్తు గానీ కాదని అది తెలంగాణ ప్రజల ఆస్తి అని ఎమ్మెల్యేగా ఎవరు ఉంటే వారు అందులో ఉండే అధికారం ఉందన్నారు.

ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా లేని భాస్కరరావు మిర్యాలగూడ పేరు కూడా మార్చుతారని అడ్డగోలుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఆయన ఆంధ్ర ప్రాంతంలోని నాదెండ్ల నుండి వచ్చి ఇక్కడ జానా రెడ్డి సూట్ కేసులు మోస్తూ అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చేరవేస్తూ అందరి వాడైనా జానారెడ్డి ని మోసం చేసి మాయమాటలు చెప్పి ఎమ్మెల్యే అయి గెలిపించిన పార్టీని నమ్మి సీటు ఇచ్చిన పెద్దలు జానా రెడ్డిని మోసం చేసిన విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు బోట్ క్లబ్ లో ఉండే విషయం మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని, మన నాయకుడు ఎంపీ రఘువీర్, ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక బిఆర్ఎస్ నాయకులు పిచ్చి లేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మరొకసారి ఇలా మాట్లాడితే ఈ ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని వారన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, మాజీ ఎంపీటీసీ బెజ్జం సాయి, జడ్పిటిసి నాగు నాయక్, కిసాన్ సెల్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, కొమ్ము శ్రీనివాస్, బండి యాదగిరి రెడ్డి, రుణాల్ రెడ్డి, కొమ్మన నాగలక్ష్మి, పందిరి అనిత, ఆలగడప గిరిధర్, జావీద్, గుంజ శ్రీను, చల్లా వెంకన్న, గంధం రామకృష్ణ, మల్లాల అమృత రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు బంటు లక్ష్మీనారాయణ, మేకల శ్రీనివాస్, బాసాని గిరి, గోదాల జానకి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Gold Price : నిలకడగా బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  2. Miryalaguda : తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ ప్రవేశాలు.. దరఖాస్తుల ఆహ్వానం..!

  3. Nalgonda : నీట్ ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు ఇవి తెచ్చుకోవాలి.. జిల్లా కలెక్టర్..!

  4. IPO : ఐపీవో బాటలో మరో కంపెనీ.. సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించిన కరోనా రెమెడీస్ లిమిటెడ్..!

  5. Godrej: రికార్డ్ సృష్టించిన గోద్రెజ్ ప్రాపర్టీస్.. ఆదాయం, లాభం భారీగా పెరుగుదల..!

  6. Gold Price : భారీగా దిగి వచ్చిన బంగారం.. ఈరోజు ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు