Hinduja : నాలుగో ఏడాది అగ్రస్థానంలో హిందూజ..!
Hinduja : నాలుగో ఏడాది అగ్రస్థానంలో హిందూజ..!
లండన్:
బ్రిటన్‌లోని అత్యంత సంపన్నుల జాబితాలో హిందూజా కుటుంబం తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ ఘనత సాధించింది. 110 ఏళ్ల చరిత్ర కలిగిన హిందూజా గ్రూప్‌నకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న గోపీచంద్ హిందూజా నేతృత్వంలోని ఈ కుటుంబం, ఈ ఏడాది సండే టైమ్స్ రిచ్ లిస్ట్‌లో £35.3 బిలియన్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచింది.
సండే టైమ్స్ ప్రచురించే ఈ జాబితా, యునైటెడ్ కింగ్డమ్లో నివసిస్తున్న అత్యంత ధనవంతులైన వ్యక్తులు, కుటుంబాల వార్షిక ర్యాంకింగ్‌ను తెలియజేస్తుంది. 2025 ఎడిషన్‌లో మొత్తం 350 మంది పేర్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ, హిందూజా తమ వ్యాపార సామర్థ్యాన్ని, ప్రపంచ నాయకత్వాన్ని సమర్థంగా కొనసాగిస్తూ వస్తోంది.
వీరి సంస్థలు 38 దేశాలలో విస్తరించి ఉన్నాయి. మొబిలిటీ, డిజిటల్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, మీడియా, ప్రాజెక్ట్ డెవలప్మెంట్, లూబ్రికెంట్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, ట్రేడింగ్, హెల్త్‌కేర్ వంటి అనేక రంగాలలో ఈ సంస్థలు పెట్టుబడులు కలిగి ఉన్నాయి.
గత ఏడాది కాలంలో హిందూజా గ్రూప్ భారతదేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంపై మరింత దృష్టి సారించింది. వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెంచింది.
సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2025లో చోటు దక్కించుకున్న ఇతర ప్రముఖులలో డేవిడ్, సైమన్ రూబెన్ కుటుంబం (£26.873 బిలియన్లు), సర్ లియోనార్డ్ బ్లావంటిక్ (£25.725 బిలియన్లు), సర్ జేమ్స్ డైసన్ కుటుంబం (£20.8 బిలియన్లు), ఇడాన్ ఓఫర్ (£20.121 బిలియన్లు), గై, జార్జ్, అలన్నా, గాలెన్ వెస్టన్ కుటుంబం (£17.746 బిలియన్లు), సర్ జిమ్ రాట్క్లిఫ్ (£17.046 బిలియన్లు), లక్ష్మీ మిట్టల్, కుటుంబం (£15.444 బిలియన్ల) ఉన్నారు.
MOST READ :
-
TG News : తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ట్రిక్.. ఫోన్ చూడకుండానే మెసేజ్ చేసింది ఎవరో చెప్పొచ్చు..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!
-
TCS: టీసీఎస్ ఘనత.. ప్రపంచంలోని టాప్-50 బ్రాండ్స్‌లో ఒకటిగా గుర్తింపు..!









