క్రైంBreaking Newsమహబూబాబాద్ జిల్లా

ACCIDENT : ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి..!

ACCIDENT : ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి..!

తొర్రూర్, మన సాక్షి:

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన తొర్రూరు పట్టణ కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. శనివారం రాత్రి సర్వి రమేష్ (42) అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై బస్టాండ్ కు వెళ్లి తిరిగి తన ఇంటికి, అన్నారం రోడ్డులో వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న జఫర్గడ్ మండలానికి చెందిన జువారి బన్నీ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంతో ఢీ కొనడంతో రమేష్ తలకు తీవ్ర గాయమవడంతో చెవిలో నుండి రక్తస్రావం జరిగింది.

అతన్ని స్థానికులు తొలుత వరంగల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో, హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతు రమేష్ సోమవారం ఉదయం 11:45 నిముషాలకు మృతి చెందాడు. మృతుడి అన్న సర్వి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది. తొర్రూర్ ఎస్సై జి,ఉపేందర్ తెలిపారు.

మరిన్ని వార్తలు