Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

Benz: ఆకర్షణీయమైన స్పోర్ట్స్‌కార్లు.. ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్..!

Benz: ఆకర్షణీయమైన స్పోర్ట్స్‌కార్లు.. ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్..!

ముంబై, మన సాక్షి:

లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్-బెంజ్ కొత్తగా తమ ‘జీటీ ఫ్యామిలీ’ శ్రేణిలో రెండు స్పోర్ట్స్‌కార్లను ఆవిష్కరించింది. మెర్సిడెస్-ఏఎంజీ జీటీ 63 4MATIC+ మరియు మెర్సిడెస్-ఏఎంజీ జీటీ 63 PRO 4MATIC+ కూపేలు వీటిలో ఉన్నాయి. రేసింగ్‌కి అనువైన టెక్నాలజీ, మరియు రోజువారీ వినియోగానికి మరింత మెరుగుపర్చబడిన విధానాల మేళవింపుతో ఇవి వాహనదారులకు అసమానమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

మెర్సిడెస్-ఏఎంజీ జీటీ 63 4MATIC+లో 430 kW (585 hp) మరియు 800 Nm టార్క్‌నిచ్చే 4.0 లీటర్ V8 బైటర్బో ఇంజిన్ ఉంటుంది. కేవలం 3.2 సెకన్లలోనే 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది. గంటకు 315 కి.మీ. గరిష్ట వేగం ఉంటుంది. ఇక ట్రాక్ ఫోకస్డ్ వేరియంట్ అయిన మెర్సిడెస్-ఏఎంజీ జీటీ 63 PRO 4MATIC+ వాహనం 450 kW (612 hp) మరియు 850 Nm టార్క్‌నిస్తుంది.

అదనంగా ఎయిర్ డిఫ్లెక్టర్లు, అప్‌గ్రేడ్ చేసిన కూలింగ్ సిస్టంలు, ట్రాక్-ఆప్టిమైజ్డ్ విడిభాగాలు ఇందులో ఉంటాయి. కేవలం 3.1 సెకన్లలోనే 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది. గంటకు 317 కి.మీ. గరిష్ట వేగం ఉంటుంది.

మెర్సిడెస్-ఏఎంజీ జీటీ 63 4MATIC+ ధర రూ. 3 కోట్లుగా (దేశవ్యాప్తంగా ఎక్స్-షోరూం), మెర్సిడెస్-ఏఎంజీ జీటీ 63 PRO 4MATIC+ ధర రూ. 3.65 కోట్లుగా (దేశవ్యాప్తంగా ఎక్స్-షోరూం) ఉంటాయి. జీటీ 63 డెలివరీలూ 2025 క్యూ4 నుంచి, అలాగే జీటీ 63 ప్రో డెలివరీలు 2026 క్యూ1 నుంచి ప్రారంభమవుతాయి. భారత్‌లోని ప్రీమియం రేసింగ్ సర్క్యూట్లలో ఎక్స్‌క్లూజివ్ ట్రాక్ ఎక్స్‌పీరియన్స్‌లను కూడా మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఆవిష్కరిస్తుంది.

MOST READ : 

Potato Kurma : స్టార్ హోటల్ టేస్టీ.. ఆలూ కుర్మా చేయడం వెరీ సింపుల్.. అన్నింటిలోకి అదిరిపోద్ది..!

Indiramma Atmiya Bharosa : రైతు కూలీల ఖాతాలలో డబ్బులు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. లేటెస్ట్ అప్డేట్..!

Nalgonda : ఆరుగురు ఏఎస్ఐ లకు ఎస్ఐ లుగా పదోన్నతి..!

ACB : సూర్యాపేట జిల్లాలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగి..!

మరిన్ని వార్తలు