Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking Newsపండుగలు

Ramasamudram : ముగిసిన మొహరం వేడుకలు.. పురవీదుల్లో ఊరేగిన గంధపు పీర్లు..!

Ramasamudram : ముగిసిన మొహరం వేడుకలు.. పురవీదుల్లో ఊరేగిన గంధపు పీర్లు..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం లో ని తిరుమలరెడ్డిపల్లె, దిగువపేట, ఎగువ పేట ఆర్ నడింపల్లె లలో గత పది రోజులుగా జరుగుతున్న మొహరం వేడుకలు ఆదివారం వారం ముగిశాయి. ఆదివారం వేకువ జామున హస్సేన్ హుస్సేన్ బాబయ్యలకు గంధపు పీర్ల కు హిందూ ముస్లిం సోదరులు మహిళలు భక్తి శ్రద్ధలతో పానకం కుండలు మోసి మొక్కులు చెల్లించుకున్నారు.

ప్రతి ఏడాది జూన్, జులై నెలలో మొహరం వేడుకలు కొన్ని వందల సంవత్సరాలుగా ఆనవాయితీగ జరుపుకునే పండుగ ఈ మొహరం కులమతాల అతీతంగా జరుపుకునే పండుగ. శనివారం రాత్రి ఆదివారం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.మండలం లోని తిరుమలరెడ్డిపల్లె, ఆర్ నడింపల్లె గ్రామాల నుండి గంధపు పీర్లు బాబయ్యలు మండల కేంద్రానికి మేళ తాలాలతో బయలుదేరారు.

మండల కేంద్రం లో పురవీదుల్లో నాలుగు బాబయ్యలు బజారు వీదులు గుండా దిగువ పేట లో ఉన్న మైదానం వరకు వెళ్లి మూడు బాబయ్య లు ఘనంగా మిలాకత్ నిర్వహించారు. ఈవేడుకలు తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంవత్సరానికి ఒక్కసారి నలుగురు అన్నదమ్ములు కలిసే ప్రదేశాన్ని చూసి భక్తులు పరవశించి పోయారు.

ఈ వేడుకల్లో తిరుమలరెడ్డిపల్లె గ్రామం లోగ్రామ పెద్ద లు గ్రామ స్తులు మొదటి పూజ గా రెడ్డవారి వంశీయులు పూజలు చేసిన తరువాత చింత కుంట ఫ్యామిలీ సందూరి వంశీస్తులు పూజలు నిర్వహించిన తరువాత ప్రజలు దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు.

మొహరం సందర్బంగా తిరుమలరెడ్డి పల్లె గ్రామంలోని కీర్తి శేషులు చిన్న హస్సేన్ సాబ్ కుమారులు మస్తాన్ వల్లి, బాబాసాబ్ భక్తులకు అన్నదానం నిర్వహించారు. మండల టిడిపి అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ తిరుమలరెడ్డిపల్లె గ్రామంలో జరిగిన మొహరం వేడుకల్లో పాల్గొన్నారు.

అలాగే ఆర్ నడింపల్లె గ్రామంలో జడ్పీటీసి సి హెచ్ రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు గంధపు పీర్లు, బాబయ్య లకు బూందీ, చెక్కర సదివింపులు చేయించి మొక్కులు చెల్లించి మొక్కలు తీర్చుకున్నారు. మొహరం వేడుకలకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై డి. రమేష్ బాబు పోలీస్ సిబ్బంది బందొబస్త్ నిర్వహించారు. మొహరం వేడుకలు తిలకించిడానికి వచ్చిన భక్తులకు నడింపల్లె గ్రామానికి చెందిన మన్ ఫీర్ సయ్యద్ గౌస్ ఫీర్ (బాబు) కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. సర్కార్ నిర్ణయం ఇదే..!

  2. KCR : ఐదుగురు సంతానం.. కొడుకు పేరు కేసీఆర్ గా నామకరణం చేసిన అభిమాని..!

  3. District Additional Collector : జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు.. విద్యార్థులకు వాటి పట్ల పూర్తి అవగాహన కల్పించాలి..!

  4. KTR : కేటీఆర్ సంచలన సవాల్.. ప్లేస్, టైం, డేట్ అన్ని సీఎం రేవంత్ ఇష్టమే.. ఎప్పుడైనా రెడీ..!

మరిన్ని వార్తలు