Social Media: రీల్స్‌కు బానిసయ్యారా.. ఈజీగా వదిలించుకోండిలా..!
Social Media: రీల్స్‌కు బానిసయ్యారా.. ఈజీగా వదిలించుకోండిలా..!
మన సాక్షి, ఫీచర్స్ :
డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్‌స్టా రీల్స్, చాలామంది సమయాన్ని, కెరీర్‌ను ప్రభావితం చేస్తున్నాయి. రీల్స్ పిచ్చి నానాటికీ పెరిగిపోతుంది, యువత తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతూ రీల్స్ చేస్తుంటారు. రీల్స్ వినోదంలో ఒక భాగమే అయినా, కొంతమందికి ఇది వ్యసనంగా మారుతుంది. రోజంతా ఫోన్లో రీల్స్ స్క్రోలింగ్ చేస్తూ సమయాన్ని వృథా చేస్తుంటారు. మీరు కూడా సెల్ఫోన్లో రీల్స్ చూస్తూ గంటల తరబడి గడుపుతున్నారా? అయితే ఈ అలవాటును మానుకోవడానికి కింద చెప్పిన చిట్కాలను ప్రయత్నించండి.
రీల్స్ చూసే అలవాటును తగ్గించుకోవడానికి చిట్కాలు
సమయ పరిమితిని నిర్ణయించుకోండి: రీల్స్ చూడటానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోండి. ఉదాహరణకు, రోజుకు 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే రీల్స్ చూడాలని మీకు మీరే పరిమితి పెట్టుకోండి. ఈ సమయం దాటిన తర్వాత రీల్స్ చూడటం ఆపేయండి.
నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి: మీ ఫోన్లో సోషల్ మీడియా నోటిఫికేషన్లను నిలిపివేయండి. మీ స్నేహితులు రీల్స్ షేర్ చేసినప్పుడు వచ్చే నోటిఫికేషన్లు మిమ్మల్ని మళ్లీ మళ్లీ సోషల్ మీడియాను తెరవమని ప్రోత్సహిస్తాయి. కాబట్టి, నోటిఫికేషన్లు రాకుండా చూసుకోండి.
కొత్త అలవాట్లను అలవర్చుకోండి: చాలామంది ఖాళీ సమయంలో రీల్స్ చూస్తుంటారు. ఆ సమయాన్ని రీల్స్ చూడటానికి బదులుగా, పుస్తకాలు చదవడం, పాటలు వినడం, బొమ్మలు గీయడం, ఆటలు ఆడటం వంటి ఇతర కార్యకలాపాలకు కేటాయించండి. ఇది రీల్స్ వ్యసనం నుంచి బయటపడటానికి మీకు సహాయపడుతుంది.
మొబైల్ డేటాను ఆఫ్ చేయండి: మీ మొబైల్ డేటాను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచకండి. ముఖ్యంగా మీరు కుటుంబం, స్నేహితులతో ఉన్నప్పుడు డేటాను ఆఫ్ చేసి, మీ ఫోన్‌ను మీకు దూరంగా ఉంచండి. ఇది రీల్స్ చూడటాన్ని నివారించి, సమయాన్ని ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది.
డిజిటల్ డిటాక్స్ సాధన చేయండి: వారానికి ఒక రోజు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండండి. దీనినే “డిజిటల్ డిటాక్స్” అంటారు. ఆ రోజు మొత్తం మీ మొబైల్‌కు దూరంగా ఉండి, మీ కుటుంబం లేదా స్నేహితులతో బయటకు వెళ్లి వారితో సమయాన్ని గడపండి. ఇలా చేయడం ద్వారా క్రమంగా రీల్స్, మొబైల్ వ్యసనాన్ని వదిలించుకోవచ్చు.
ఫోన్‌ను దూరంగా ఉంచండి: మీ ఫోన్‌ను వీలైనంత వరకు మీ నుండి దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే, మీరు దాన్ని పదే పదే ఆన్ చేసి రీల్స్ చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ మొబైల్ ఫోన్‌ను దూరంగా ఉంచండి. అవసరమైనప్పుడు మాత్రమే దానిని ఉపయోగించడం అలవాటు చేసుకోండి.
By : Banothu Santhosh, Hyderabad
MOST READ :
-
CM Revanth Reddy : పదేళ్లలో రేషన్ షాపులు తెరవలేదు.. కానీ బెల్ట్ షాపులు తెరిచారు.. సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!
-
Lipstick: లిప్‌స్టిక్ త్వరగా పోతోందా.. ఈ చిట్కాలు మీకోసమే..!
-
Jeera water : జీలకర నీరు తాగితే ఏమవుతుందో తెలుసా.. వెంటనే తెలుసుకోండి..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!









