తెలంగాణBreaking News

TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి గుడ్ న్యూస్..!

TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి గుడ్ న్యూస్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డయాలసిస్ పేషెంట్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త తెలియజేసింది. ప్రభుత్వం అందజేసే చేయూత పెన్షన్లలో కొత్తగా డయాలసిస్ పేషంట్లకు చేయూత పెన్షన్లు మంజూరు చేయనున్నది. కొత్తగా 681 మంది డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం చేయూత పెన్షన్లను మంజూరు చేయనున్నది. ఈ మేరకు మంత్రి సీతక్క ఫైల్ పై సంతకం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు 4011 మంది డయాలసిస్ పేషెంట్లకు గత ప్రభుత్వం పెన్షన్లు అందజేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల 4029 మంది డయాలసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్లను మంజూరు చేసింది. తాజాగా మరో 681 మంది చేయూత పెన్షన్లను మంజూరు చేసింది. వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న డయాలసిస్ పేషంట్లను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా వీరిని గుర్తించింది.

వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత పెన్షన్లను మంజూరు చేసింది. 681 మంది డయాలసిస్ పేషంట్ లో అత్యధికంగా హైదరాబాదులో 629 మంది చికిత్స పొందుతున్నారు. మిగతావారు వివిధ జిల్లాలలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరందరికీ చేయూత పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

క్లిక్ చేసి ఈ వార్తలు కూడా చదవండి : 

  1. Nalgonda : మీ ఊరిలో మీరే రేవంత్ రెడ్డి, మీరే కోమటిరెడ్డి.. ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!

  2. Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే.. సాయంత్రం నాలుగు గంటల వరకు..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు మీకు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

  4. TG New : ఆ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

  5. Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ గురించి మీకు తెలుసా.. ముందే గర్తించడం ఎలా.. జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు