UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం.. ఏదైనా పిన్ నెంబర్ ఉండదు.. మరి లావాదేవీలు ఎలాగో తెలుసుకుందాం..!
UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం.. ఏదైనా పిన్ నెంబర్ ఉండదు.. మరి లావాదేవీలు ఎలాగో తెలుసుకుందాం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
డిజిటల్ లావాదేవీలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఫోన్ పే, గూగుల్ పే, పేటియం ద్వారా లావాదేవీలను కొనసాగిస్తున్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయి. దాంతో ఏ వస్తువు కొనుగోలు చేసినా కూడా డిజిటల్ రూపంలోనే లావాదేవీలను చేస్తున్న విషయం తెలిసిందే.
డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ఎక్కువమంది దానిని వినియోగిస్తున్నారు. కానీ డిజిటల్ లావాదేవీలైన ఫోన్ పే, గూగుల్ పే, పేటియం ద్వారా లావాదేవీలు కొనసాగించే సమయంలో తప్పనిసరిగా పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
దాంతో కొంతమంది పిన్ నెంబర్ మర్చిపోయి.. రాంగ్ పిన్ నెంబర్ నమోదు చేయడం, ఒక్కోసారి పిన్ నెంబర్ గుర్తు రాక ఇబ్బందులు పడుతున్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది.
యూపీఐ లావాదేవీల్లో కీలకమైన అప్డేట్ రాబోతోంది. యూపీఐ లావాదేవీల్లో భద్రత తో పాటు ఈజీగా లావాదేవీలు చేసిందుకు గాను కొత్త ఫీచర్ ను తీసుకురాబోతోంది. పిన్ నెంబర్ స్థానంలో త్వరలో ఫేస్ ఐడెంటిఫికేషన్ లేదా వేలిముద్ర తీసుకురాబోతుంది.
దీనివల్ల పిన్ నెంబర్ జ్ఞాపకం లేని వారికి, వృద్ధులకు చాలా ఈజీగా ఉంటుంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యాప్ ల ద్వారా చెల్లింపులు చేసే సమయంలో ఫేస్ ఐడెంటిఫికేషన్ కానీ వేలిముద్ర గాని ఉంటే లావాదేవీలు కూడా చాలా ఈజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడొస్తుందనే విషయంపై NPCI ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ త్వరలో కొత్త ఫీచర్ ను తీసుకురాబోతోంది.
MOST READ :
-
విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తా..!
-
PMKY : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో రూ.2000 జమ..!
-
Gold Price : బంగారం ధర మళ్లీ 15,300 పెరిగిందా.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
-
Attendance : ప్రజెంట్ సార్.. సీఎం ఫోటోతో పంచాయతీ కార్యదర్శి.. అధికారుల పరిశీలనలో వెలుగులోకి..!
-
TG News : ఆధార్ నెంబర్ చెప్తే చాలు.. ఇక రెండు నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం..!









