Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

District collector : భూసేకరణ పై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!

District collector : భూసేకరణ పై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!

కరీంనగర్, మనసాక్షి:

కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూ సేకరణ వేగవంతం చేయాలనీ, సేకరించడంలో ఎదురవుతున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.

భారత జాతీయ రహదారి సంస్థ ప్రాజెక్ట్ సంచాలకులు దుర్గాప్రసాద్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, రెవిన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ బాబులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి భూసేకరణ సమస్యలపై సమావేశం నిర్వహించారు.

భూసేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను గురించి చర్చించారు. ఇదివరకే పరిహారం చెల్లింపు పూర్తయిన భూమిని త్వరగా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. సేకరణ విషయంలో అభ్యంతరాలు ఉన్న వారితో మాట్లాడి సేకరణకు సహకరించేలా చూడాలని అన్నారు.

భూసేకరణలో ఉన్న సమస్యలన్నింటిని త్వరితగతిన పరిష్కరించి జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూమిని భారత జాతీయ రహదారి సంస్థకు స్వాధీనం చేయాలని సూచించారు. ఇందుకు అధికారులకు పలు సూచనలు చేశారు.

MOST READ :

  1. Phone Pe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఆ సేవలు బంద్..!

  2. SMFG : ఇండియా క్రెడిట్ నూతన సీఈఓగా రవి నారాయణన్..!

  3. BIG BREAKING : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు..!

  4. Panchayat Electrons : పంచాయతీ ఎన్నికల పై కీలక అప్డేట్.. వారికి గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు