CM Revanth Reddy : కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఆ భూములు బదిలీ చేయాలని వినతి..!

CM Revanth Reddy : కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఆ భూములు బదిలీ చేయాలని వినతి..!
మనసాక్షి, న్యూ ఢిల్లీ :
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ భూములను బదిలీ చేయాలని ఆయన మంత్రిని కోరారు. అదేవిధంగా మూసీ, ఇసా నదుల సంగమం వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపడుతున్నట్లు మంత్రికి తెలియజేశారు.
ఈ రెండు నదుల సంఘము వద్ద గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం కోసం అక్కడ ఉన్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరారు. జాతీయ ఐక్యతకు, గాంధీ విలువలకు చిహ్నంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని ఆయన తెలియజేశారు.
ఈ ప్రాజెక్టులో నాలెడ్జ్ హబ్, ధ్యానగ్రామం, చేనేత ప్రోత్సాహక కేంద్రం, ప్రజా వినోద ప్రదేశాలు, ప్రకృతి దృశ్యాలు, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మించడం ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి కి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
రేవంత్ రెడ్డి వెంట ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మూసీ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి, కేంద్ర ప్రాజెక్టులు పథకాల సమన్వయకర్త గౌరవ్ ఉప్పల్ తదితరులు ఉన్నారు.
MOST READ :
-
RDO : సంగారెడ్డి ఆర్టీవో ఆకస్మిక బదిలీ.. ఎందుకో తెలుసా..!
-
ACB : రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిని మనిహరీక..!
-
Minister Rajanarsimha : కస్తూర్బా పాఠశాల ఎస్ ఓ పై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం..!
-
District collector : డిఈఓ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. ఆ డిప్యూటేషన్ వెంటనే రద్దు చేయలని ఆదేశం..!










