Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking Newsవిద్య

Ramasamudram : విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు కొనిచ్చిన హెచ్ఎం..!

Ramasamudram : విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు కొనిచ్చిన హెచ్ఎం..!

రామసముద్రం, మనసాక్షి :

రామసముద్రం.. హరిజనవాడలో నివసిస్తున్న పేద విద్యార్థులను ఎం ఈవో హెచ్ఎం హేమలత గుర్తించి వారిని మండల కేంద్రంలోని తూర్పు పాఠశాలలో చేర్పించారు. బుధవారం ఎగువ హరిజనవాడలోని అవతల కాళీ ప్రదేశంలో పూరి గుడిసెలో నివసిస్తున్న నిరుపేదల గురించి స్థానికులు హేమలత దృష్టికి తీసుకువచ్చారు.

వెంటనే స్పందించిన హెచ్ఎం హరిజనవాడకు వెళ్లారు. అక్కడ వారి జీవన స్థితిగతులను తెలుసుకున్నారు. కనీసం వారికి ఆధార్ కార్డులు కూడా లేవు. చాలా నిరుపేదలు. హేమలత చలించిపోయింది. ఎలాగైనా ఈ నిరుపేదల చిన్నారులను విద్యావంతులను చేయాలని ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఎంఈఓ హేమలత దృష్టికి హెచ్ఎం తీసుకొచ్చారు. అక్కడ ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకున్నారు.ఆమెమాట్లాడుతూ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించడం జరుగుతుందన్నారు.

వారికి అవసరమైన పుస్తకాలు, బ్యాగులు, పలకలు హెచ్ఎం హేమలత తన సొంత నిధులతో కొనుగోలు చేసి వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఈవో హెచ్ ఎం హేమలత,సి ఆర్ పి అనిత, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Penpahad : యూరియా కోసం రైతుల రాస్తారోకో..!

  2. TG News : నడి రోడ్డుపై ఏంటివి ఇవి.. ఇలా ఎందుకు పెట్టారు.. అయినా వాళ్లు ఇటువైపు చూడరు..!

  3. Aadhaar Centers : ఆధార్ కేంద్రాల్లో దోపిడీ.. అదనపు వసూళ్లు.. పట్టించుకోని అధికారులు..!

  4. Sub Collector : యూరియా పంపిణీ ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్..!

మరిన్ని వార్తలు