Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BIG BREAKING : నాగార్జునసాగర్ హైవే పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి..!

BIG BREAKING : నాగార్జునసాగర్ హైవే పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి..!

చింతపల్లి. మన సాక్షి.

హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు వాహనాలు ఎదురు ఎదురుగా ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం చెందిన సంఘటన చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామ ప్రధాన రహదారిపై సోమవారం సాయంత్రం సమయంలో ఆటో, కారు ఎదురెదురుగా బలంగా ఢీకొనగా ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

హైదరాబాదు నుండి దేవరకొండ మండలం మట్టిక తండా సొంత గ్రామానికి వస్తుండగా హైదరాబాద్ వెళుతున్న కారు బలంగా ఢీకొట్టగా మట్టిక తండాకు చెందిన రాత్లా వత్ భాస్కర్ 24, రాత్లావత్ వినోద్ 26, ఉల్చర్ల తండాకు చెందిన రవి 22, దుర్మరణం చెందారు.

అదే విధంగా ఆటోలో ఉల్చర్ల తండాకు చెందిన జర్పుల కృష్ణకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు చింతపల్లి పోలీసులు మృతదేహాలకు పంచనామ నిర్వహించి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నామని చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి తెలిపారు.

MOST READ : 

  1. Nalgonda : జగదీష్ రెడ్డిని గొల్లగూడ ఆస్పత్రిలో చేర్పించాలి..! 

  2. Tasildar : తహసిల్దార్ సీరియస్ వార్నింగ్.. అక్రమ షెడ్ల తొలగింపు..!

  3. Miryalaguda : రాష్ట్రస్థాయికి ఎంపికైన అభ్యాస్ స్కూల్ విద్యార్థులు..!

  4. Nelakondapalli : రూ.5 కోట్ల తో బౌద్ధక్షేత్రం చరిత్ర ప్రపంచం కు తెలిసేలా అభివృద్ధి..! 

మరిన్ని వార్తలు