TG News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన..!

TG News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో లక్ష ఇల్లు గృహప్రవేశానికి సిద్ధం అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో మూడు లక్షల ఇందిరమ్మ ఇల్లు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు.
శుక్రవారం తెలంగాణ సెక్రటేరియట్ లో మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. వచ్చే మార్చి నాటికి మూడు లక్షల ఇళ్లకు గృహప్రవేశం పూర్తవుతుందని, ఏప్రిల్ నాటికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పారు.
ఓఆర్ఆర్ అనుకొని నలువైపులా ఉన్న స్థలాలలో ఇల్లు నిర్మిస్తామని తెలిపారు. ఒకచోట పదివేల ఇల్లు నిర్మించి నో ప్రాఫిట్, నో లాస్ కింద మధ్య తరగతి ప్రజలకు ఇస్తామని ప్రకటించారు. గ్లోబల్ సమ్మిట్ లో ప్రణాళికలు ప్రకటిస్తామని మంత్రి పేర్కొన్నారు.
గతంలో నిర్మించి మధ్యలో వదిలేసిన ఇళ్లకు కూడా ఇందిరమ్మ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. రూరల్, అర్బన్ లో కూడా ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు కూడా త్వరలో ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
MOST READ :
-
Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఎవరూ ఆపరు.. నేరుగా వెళ్ళొచ్చు..!
-
CM Revanth Reddy : ఇంద్రవెల్లి గుర్తొస్తుంది.. కొమురం భీం యాదిలోకి వస్తాడు..!
-
TG News : రైతులకు తీపి కబురు.. ఖాతాలలో రూ.7887 కోట్లు, రాకుంటే ఇలా చేయండి..!
-
CM Revanth Reddy : మోదీజీ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. మా ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడి..!










