Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం
Nalgonda : చింతపల్లిలో ప్రశాంతంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్..!

Nalgonda : చింతపల్లిలో ప్రశాంతంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్..!
చింతపల్లి, మనసాక్షి :
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో నేడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 గ్రామ పంచాయతీలలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 42 వేల 654 ఓటర్లు కు గాను 21,227పురుషుల ఓట్లు,21, 421 మహిళా ఓటర్లుఓటు హక్కును వినియోగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆరు జోన్లు, 12 రూట్లు, 268 పోలింగ్ ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు.
11 గంటల వరకు వచ్చిన ఓటింగ్ శాతం వివరాలు పురుషులు 11వేల371,మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు, అదేవిధంగా 11, 740ఇప్పటివరకు తమ ఓటు హక్కు సద్వినియోపరుచుకున్నారు. మొత్తం 23 వేల110 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 54.18 శాతం ఓటింగ్ నమోదు అయినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుజాత పేర్కొన్నారు.









