Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : జిల్లా ఎస్పీ కీలక ప్రకటన.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..! 

నల్లగొండ జిల్లాలో జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

Nalgonda : జిల్లా ఎస్పీ కీలక ప్రకటన.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..! 

నల్లగొండ, మనసాక్షి :

నల్లగొండ జిల్లాలో జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
తెలిపారు.

జిల్లా పరిధిలోని నల్లగొండ కార్పొరేషన్ తో పాటు ఆరు మున్సిపాలిటీలలో జరిగే ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఒక అడిషనల్ ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 29 మంది సీఐలు, 84 మంది ఎస్‌ఐలు, మరియు ఇతర పోలీస్ సిబ్బందితో కలిపి మొత్తం 1097 మంది మరియు 5 ప్లాటున్ల టిజిఎస్పీ పోలీస్ సిబ్బందిని నియమించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.

ముఖ్యంగా ఈ నెల 11వ తేదీన ఒక కార్పొరేషన్ తో పాటు 06 మున్సిపాలిటీలలో 164 వార్డులో 473 పోలింగ్ స్టేషన్లలలో జరగనున్న ఎన్నికల్లో 66 సమస్యాత్మక పోలింగ్ స్టేషనులను గుర్తించి, ఆయా పోలింగ్ స్టేషన్ పరిధిలో అదనపు బలగాలు, 07 స్ట్రైకింగ్ ఫోర్స్,14 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 47 రూట్ మొబైల్ పార్టీలు, 08 ఎస్ఎస్టి టీంలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు.

ఎక్కడైనా చిన్నపాటి సమస్య తలెత్తినా అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ముందస్తు చర్యలు తీసుకున్నామని అన్నారు.
ఎన్నికల సమయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్న పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలను కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని జిల్లా ఎస్పీ తెలిపారు. గత ఎన్నికల్లో గొడవలు, కేసుల్లో ఉన్న నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మరియు రౌడీ షీటర్లను గుర్తించి జిల్లా వ్యాప్తంగా 333 మందిని బైండోవర్ చేయడంతో పాటు, వారి కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా గొడవలకు గానీ, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు గానీ పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున, ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, మంటను ప్రేరేపించే వస్తువులు తీసుకురావడానికి అనుమతి లేదని తెలిపారు.

పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 (బి.ఎన్.ఎస్.ఎస్) సెక్షన్ అమలులో ఉంటుందని, కావున నలుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల నుండి 100 మీటర్ల పరిధిలో ఎవరూ ఉండకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పోలింగ్ కేంద్రాలలో గానీ, పరిసర ప్రాంతాలలో గానీ ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టే ఉద్దేశంతో నగదు, మద్యం లేదా ఇతర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిసిన వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు చేపట్టే చట్టబద్ధమైన చర్యలను అతిక్రమిస్తే అట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. కావున జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీసు యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

MOST READ 

  1. Miryalaguda : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి.. ఓటర్లు సిబ్బంది ఎంతమందటే..!

  2. TG News : తెలంగాణలో సర్పంచులకు మరో కీలక అధికారాలు..!

  3. Nalgonda : సాగర్ ఎడమ కాలువలో కారు గల్లంతుకు ప్రధాన కారణం.. ఆ చిన్న పొరపాటే, అలా ఎవరు చేయొద్దు..!

  4. Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా డేట్ ఫిక్స్..!

మరిన్ని వార్తలు