Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Khammam : వెలుగుమట్ల బాధితులకు బీజేపీ అండ.. బాధితులను పరామర్శించిన ఈటెల..!

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఒకప్పుడు పేదల ఆశలకు, కలలకు సాక్ష్యంగా నిలిచిన ఆ ప్రాంతం, ఇప్పుడు కన్నీటి సంద్రంగా మారింది. రెక్కలు ముక్కలు చేసుకుని, పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇళ్లు కళ్లెదుటే నేలమట్టం అవుతుంటే ఆ పేదలు గుండెలు పగిలేలా రోదించారు.

Khammam : వెలుగుమట్ల బాధితులకు బీజేపీ అండ.. బాధితులను పరామర్శించిన ఈటెల..!

ఖమ్మం, మన సాక్షి:

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఒకప్పుడు పేదల ఆశలకు, కలలకు సాక్ష్యంగా నిలిచిన ఆ ప్రాంతం, ఇప్పుడు కన్నీటి సంద్రంగా మారింది. రెక్కలు ముక్కలు చేసుకుని, పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇళ్లు కళ్లెదుటే నేలమట్టం అవుతుంటే ఆ పేదలు గుండెలు పగిలేలా రోదించారు. తమకు జరిగిన అన్యాయాన్ని, అధికారుల అమానుషత్వాన్ని బీజేపీ జాతీయ నాయకులు, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముందు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చెప్పుకున్నారు.

వెలుగుమట్ల భూదాన భూముల బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఈటెల రాజేందర్ కుడుపుకోతను, అక్కడ నెలకొన్న హృదయ విదారక దృశ్యాలను చూసి చలించిపోయారు. “పొద్దు పొద్దున్నే నాలుగు వేల మంది పోలీసు బలగాలను, మున్సిపాలిటీ వాళ్ళను, రెవెన్యూ వాళ్ళను వేసుకుని వచ్చారు సార్. మేమేమైనా టెర్రరిస్టులమా? దేశద్రోహులమా? ఎందుకు సార్ మా మీద ఇంత దౌర్జన్యం? కనీసం రెండు గంటల సమయం అడిగినా ఇవ్వలేదు. ఇంట్లోని వస్తువులు, కనీసం గ్యాస్ బండలు, పిల్లల పుస్తకాలు కూడా తీసుకోనివ్వకుండా ఇళ్లను కూల్చేశారు..”

బాధితురాల్ని పరామర్శిస్తున్న ఈటెల రాజేందర్

అంటూ మహిళలు ఈటెల ముందు భోరుమన్నారు. గర్భవతులు, చిన్న పిల్లలు నాలుగు రోజులుగా చెట్ల కిందే నిద్రపోతున్నారని, చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు రాత్రికి రాత్రే కప్పుకోవడానికి వేసుకున్న ప్లాస్టిక్ కవర్లు, కూలిపోయిన రేకుల షెడ్లను ఈటెల రాజేందర్ స్వయంగా పరిశీలించారు.

కన్నీరు పెట్టుకుంటున్న వృద్ధులను, మహిళలను ఓదార్చారు. “చంటి పిల్లలు, గర్భిణీ స్త్రీలు అనే కనికరం లేకుండా, కనీసం బట్టలు, బియ్యం తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరు అమానుషం” అని ఆయన మండిపడ్డారు. బాధితుల పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేస్తామని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ,భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, గల్లా సత్యనారాయణ ,నాయకులు శీలం పాపారావు, దొంగల సత్యనారాయణ, మందడపు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వర్లు, బండారు నరేష్, నున్న రవికుమార్, విజయరాజు, వీరవల్లి రాజేష్, కుమిలి శ్రీనివాస్, ఏలూరి నాగేశ్వరరావు,రవి రాథోడ్, శ్యామ్ రాథోడ్, కందుల శ్రీకృష్ణ, మందా సరస్వతి,మనీ , నకిరేకంటి వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు