Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణఅభివృద్ది

సీఎం కేసీఆర్ కు ఉత్తమ్ బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్ కు ఉత్తమ్ బహిరంగ లేఖ

నల్గొండ, మనసాక్షి : పల్లె ప్రగతి పనుల బిల్లులు చెల్లించుటకు పరిశీలించాలని కోరుతూ నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలో ఐదవ విడత పల్లె ప్రగతి నిర్వహణకు సన్నద్ధమవుతోంది. కాగా అంతకు ముందు నిర్వహించిన పల్లె ప్రగతి పనులను ప్రత్యేక అధికారి, ఎం పి డి ఓ ఆదేశాల మేరకు గ్రామాలలో పనులు చేయించారని కానీ బిల్లులు రాక సంవత్సరాలు గడుస్తున్నాయని పేర్కొన్నారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి పనులకు సంబంధించి రెండు లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు బిల్లులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలలో సిబ్బంది జీతాలు, డీజిల్ బిల్లులు, కరెంటు బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐ చెల్లించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. పల్లె ప్రగతి పనుల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించి గతంలో చెల్లించాల్సిన బిల్లులు చెల్లించి వారిని ఆదుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి : 

1. బావిలో శవమై తేలిన ముగ్గురు అక్క చెల్లెలు, ఇద్దరు చిన్నారులు

2. BREAKING : విమానం ఆచూకీ గల్లంతు, 22 మంది ప్రయాణికులు, నలుగురు భారతీయులు

3. IPL : నేడు ఫైనల్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్

మరిన్ని వార్తలు