Breaking Newsజాతరలుజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : కమనీయంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం..!

నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం కమనీయంగా సాగింది. గురువారం తెల్లవారుజామున స్వామివారి కళ్యాణ మహోత్సవంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

Miryalaguda : కమనీయంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం..!

వేములపల్లి, మన సాక్షి:

నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం కమనీయంగా సాగింది. గురువారం తెల్లవారుజామున స్వామివారి కళ్యాణ మహోత్సవంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కల్యాణోత్సవాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారబోయిన సతీష్,ఉప సర్పంచ్ రాచమల్ల చిన్న సైదులు, పాలకవర్గం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు