Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణసూర్యాపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఇక మున్సిపాలిటీలో ఆ పనులపై ప్రత్యేక దృష్టి..!

99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక"లో భాగంగా నేటి నుంచి మార్చి 15వ తేదీ వరకు కొనసాగనున్న పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు.

District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఇక మున్సిపాలిటీలో ఆ పనులపై ప్రత్యేక దృష్టి..!

సూర్యాపేట, మనసాక్షి :

99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నేటి నుంచి మార్చి 15వ తేదీ వరకు కొనసాగనున్న పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మొదటి థీమ్ అయిన “పరిశుభ్రత” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం సూర్యాపేట మున్సిపాలిటీ నుండి ప్రారంభించారు.

అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పరిశుభ్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నేటి నుంచి మార్చి 15వ తేదీ వరకు కొనసాగనున్న పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే అధికారులు తమ తమ కార్యాలయాల్లో ఉన్న పెండింగ్ ఫైల్స్‌ను త్వరితగతిన క్లియర్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మార్చి నెల ఆర్థిక సంవత్సరానికి చివరి నెల కావడంతో మున్సిపాలిటీల ఆదాయం పెంచేందుకు పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.

మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో గల పెండింగ్ ఫైళ్లను, పారిశుద్ధ్య పనులను త్వరితగతిన పరిష్కరించుటకు తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పరిశుభ్రతపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి, జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: 

మరిన్ని వార్తలు