Uncategorized

District collector : జిల్లా కలెక్టర్ సీరియస్.. ఆ పిర్యాదులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు..! 

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు.

District collector : జిల్లా కలెక్టర్ సీరియస్.. ఆ పిర్యాదులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు..! 

సూర్యాపేట, మనసాక్షి :

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి గ్రీవిన్స్ లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు దరఖాస్తు లను పరిష్కరించాలని తెలిపారు.

సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 33 దరఖాస్తులు, డి ఆర్ డి ఏ 6, డి పి ఓ 5, డి డబ్ల్యూ ఓ 5, మిగిలిన 29 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 78 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కే సీతారామా రావు, సీఈఓ జిల్లా పరిషత్ శిరీష, రెవెన్యూ డివిజన్ అధికారి వేణు మాధవరావు, ఇతర జిల్లా అధికారులు, తదితరులు హాజరైనారు.

మరిన్ని వార్తలు