Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : కుమారుడి మృతితో తల్లి మనస్తాపం.. నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య..! 

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని మోసంగి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురైన తల్లి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ఎస్సై ఎన్.వెంకన్న తెలిపారు.

Nalgonda : కుమారుడి మృతితో తల్లి మనస్తాపం.. నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య..! 

గుర్రంపోడు, మన సాక్షి :

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని మోసంగి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురైన తల్లి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ఎస్సై ఎన్.వెంకన్న తెలిపారు. గ్రామానికి చెందిన బొంగరాల వెంకటమ్మ (49) కుమారుడు శ్రీధర్ కొంతకాలం క్రితం మరణించాడు. అప్పటి నుండి ఆమె మానసిక స్థితి సరిగా లేక తీవ్ర ఆవేదనతో ఉండేవారు.

ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం మద్యం సేవించిన ఆమె, తన ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలంలో ఒంటిపై నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆమె మృతి చెందారు. మృతురాలి పెద్ద కుమారుడు బొంగరాల శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వివరించారు.

మరిన్ని వార్తలు