Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

నల్గొండ జిల్లా శెట్టిపాలెంలో అమానవీయ ఘటన.. మానవ మృగం, తండ్రి స్థానంలో ఉండి బాలికపై అఘాయిత్యం..!

తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటున్న ఆ బాలిక బాగోగులు చూసుకునేందుకు తండ్రి స్థానంలో నిలబడాల్సిన ఆ బంధువు.. బాలికను లో బరచుకొని పలుమార్లు అఘాయిత్యనికి పాల్పడ్డాడు.

నల్గొండ జిల్లా శెట్టిపాలెంలో అమానవీయ ఘటన.. మానవ మృగం, తండ్రి స్థానంలో ఉండి బాలికపై అఘాయిత్యం..!

మిర్యాలగూడ పట్టణం

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటున్న ఆ బాలిక బాగోగులు చూసుకునేందుకు తండ్రి స్థానంలో నిలబడాల్సిన ఆ బంధువు.. బాలికను లో బరచుకొని పలుమార్లు అఘాయిత్యనికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ అతడి ఆగడాలు ఆపక పోవడంతో విసుగు చెందిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిపై ఫోక్స్ కేసు నమోదు చేశారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ గ్రామీణ సిఐ. పిఎన్ డి. ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మాడుగులపల్లికి చెందిన ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాదులో ఉంటుంది  తమ కుమార్తెను కొన్నేళ్ల క్రితం దామరచర్లలో చదివించారు. ఆ సమయంలో ప్రతి ఆదివారం బాలికను చూసి రావాలని వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన సమీప బంధువు కోడిరెక్క నాగేందర్ కు చెప్పారు.  ప్రతి ఆదివారం పాఠశాలకు వెళ్లి బాలికను కలిసే అతడు ఆమె ఎనిమిదో తరగతిలో ఉండగా లోబరచు కున్నాడు.

అప్పటి నుంచి పలుమార్లు బలవంతంగా . అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తర్వాత బాలిక హైదరాబాదులో ఉంటున్న తల్లిదండ్రుల వద్దనే ఉంటూ ఉన్నత చదువులు చదువుతుంది. ఈక్రమంలో తనతోనే ఉండాలని వివాహం చేసుకోవద్దని యువతని వేధిస్తుండడంతో బాధితులు ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించారు. అక్కడ నుంచి కేసు వేములపల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయగా విచారణ చేపట్టి ఫోక్స్ కేసు నమోదు చేసి నిందితుడిని శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు