Suryapet : సూర్యాపేట జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.. కేజీన్నర గంజాయి స్వాధీనం..!
గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.ఎస్సై పరమేష్ తెలిపిన వివరాలు.. మేళ్లచెరువు మండలం వెంకట్రామాపురం గ్రామ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం వచ్చింది.

Suryapet : సూర్యాపేట జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.. కేజీన్నర గంజాయి స్వాధీనం..!
మేళ్లచెరువు, మన సాక్షి:
గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.ఎస్సై పరమేష్ తెలిపిన వివరాలు.. మేళ్లచెరువు మండలం వెంకట్రామాపురం గ్రామ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం వచ్చింది. సిబ్బందితో కల్సి ఉదయం సదరు ప్రదేశంలో మాటు వేశాం.
అక్కడికి నలుగురు వ్యక్తులు చేరుకుని పాలిథీన్ కవర్లతో తెచ్చుకున్న గంజాయిని పంచుకుంటుండగా వారిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నామని అన్నారు.వారి నుండి కేజీన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.ఎపి లోని అనకాపల్లి కి చెందిన గండ్రోతు వెంకట శ్రీహర్ష స్థానికంగా ఓ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తూ, గంజాయిని కొని ఇక్కడ అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు.
డిసిఎం డ్రైవర్లుగా పని చేస్తున్న ఎర్రగట్టుకు చెందిన పందిరి నర్సింహారావు,మఠంపల్లికి చెందిన కామల్ల శ్రీనివాస్,కోదాడ మండలం రామలక్ష్మీ పురంకు చెందిన ఫౌల్ట్రీ యజమాని తుపాకుల ఉపేందర్ రెడ్డి లకు శ్రీహర్ష గంజాయిని కొంత కాలంగా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇలా వీరందరూ తమ పరిచయస్తులకు అమ్మకాలు జరుపుతున్నట్లు తేలిందని అన్నారు. నిందితుల నుండి గంజాయితో పాటు సెల్ ఫోన్లు,ఒక బైక్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.









